రగ్బీ (RPL) ముగింపు కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి : రేవంత్ రెడ్డి

0
275

హైదరాబాద్‌లో నిర్వహించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి  పాల్గొన్నారు,ఈ సందర్భంగా విజేత జట్లకు ట్రోఫీలు, అందజేసి అభినందనలు తెలిపారు,రగ్బీ వంటి అంతర్జాతీయ క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ సదుపాయాలు మరింతగా విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు,రగ్బీ ప్రీమియర్ లీగ్ విజయవంతంగా నిర్వహించిన  నిర్వాహకులను అభినందించిన ముఖ్యమంత్రి, ఈ లీగ్ ద్వారా దేశవ్యాప్తంగా రగ్బీ క్రీడకు మరింత ఆదరణ లభిస్తుందని అన్నారు. ముగింపు వేడుకలో మెగా స్టార్ చిరంజీవి,మృనల్ ఠాకూర్, పీవీ సింధు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు , సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి , కోచ్లు, అధికారులు , క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును ప్రారంభించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును...
By Benguluri Madhubabu 2026-04-09 07:33:01 0 213
Andhra Pradesh
భారతీయ జనతా పార్టీ గణతంత్ర వేడుకలు
గణతంత్ర దినోత్సవం సందర్బంగా భారతీయజనతాపార్టీ NTR జిల్లా కార్యాలయము వద్ద జాతీయ జెండాను ఆవిస్కరించి...
By Rajini Kumari 2026-01-26 07:54:23 0 213
Andhra Pradesh
మదనపల్లెలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలీ.
అన్నమయ్య జిల్లా యంత్రాంగం ఆదివారం మదనపల్లెలో ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ...
By Pagadala Venkateswar 2026-01-25 12:40:19 0 210
Andhra Pradesh
మహానాడు విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా: నారా లోకేశ్.
  మహానాడు విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా: నారా లోకేశ్ Andhra Nara Lokesh Dedicates...
By Pagadala Venkateswar 2026-05-29 13:10:57 0 128
Andhra Pradesh
స్థానిక కలెక్టర్ ప్రజా సమస్యల వేదిక
సోమవారం(22/12/2025) స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
By Rajini Kumari 2025-12-22 07:50:52 0 273
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com