శ్రీనివాస లాడ్జిలో జూద స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి... 7 మంది పట్టివేత, రూ.18,500 నగదు స్వాధీనం చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు

0
101

శ్రీనివాస లాడ్జిలో జూద స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి... 7 మంది పట్టివేత, రూ.18,500 నగదు స్వాధీనం చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు

మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ పామూరు ఆధ్వర్యంలో ప్రత్యేక దాడులు నిర్వహించారు.

ఈ క్రమంలో పామూరులోని శ్రీనివాస లాడ్జిలో కొందరు వ్యక్తులు జూదం ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో 7 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.18,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

జూదం, బెట్టింగ్ మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని మార్కాపురం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కే నాగుల్ మీరా నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ టిడిపి అధికార ప్రతినిధి ప్రెస్ మీట్
*17-12-2025*     *కె. నాగుల్ మీరా నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్  టిడిపి...
By Rajini Kumari 2025-12-17 09:51:52 0 259
Andhra Pradesh
ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: డాక్టర్ గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-06-17 00:52:02 0 125
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలోకి చేరికలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చీకల చేను గ్రామానికి చెందిన పలు టీడీపీ కుటుంబాలు గురువారం...
By Kothuru Murali 2026-03-06 11:26:17 0 209
Chandigarh
Monsoon Relief: Chandigarh Under Yellow Alert for Rain
Chandigarh, alongside Punjab and Haryana, is experiencing a much-needed respite from the...
By Lokeshwari Panthadi 2026-07-03 05:51:36 0 78
Ladakh
Ladakh Launches Community Solar Greenhouses in Remote Villages
The Union Territory of Ladakh has introduced community solar greenhouses across several...
By Bharat Aawaz 2025-07-17 06:37:13 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com