పంచాయతీరాజ్ శాఖ‌లో ప్రమోషన్ల పండగ.. కీలక ఆదేశాలు జారీ చేసిన పవన్.

0
99

 

పంచాయతీరాజ్ శాఖ‌లో ప్రమోషన్ల పండగ.. కీలక ఆదేశాలు జారీ చేసిన పవన్

26-06-2026 Fri 

Andhra

Pawan Kalyan issues key orders as Panchayat Raj department sees promotion festival

పంచాయతీ రాజ్‌శాఖలో మరోసారి ప్రమోషన్లు

42 మంది ఎంపీడీవోలకు డీడీవోలుగా పదోన్నతులు

కూటమి ప్రభుత్వం వచ్చాక 10 వేల మందికి ప్రమోషన్లు

వర్షాకాలంపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం

ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆ శాఖ అధికారులకు మరో తీపికబురు అందించారు. తాజాగా 42 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు (ఎంపీడీవోలు), డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లుగా (డీడీవోలు) పదోన్నతులు కల్పించే ప్రక్రియకు పచ్చజెండా ఊపారు. ఇందుకు సంబంధించిన సీనియారిటీ జాబితాను డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ) ఆమోదించింది. దీంతో త్వరలోనే వీరందరూ ఉన్నత హోదాలో బాధ్యతలు చేపట్టనున్నారు.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 10 వేల మందికి పైగా సిబ్బందికి ప్రమోషన్లు కల్పించారు. గత పదేళ్లలో ఇంత భారీ సంఖ్యలో ఈ శాఖలో పదోన్నతులు ఇవ్వడం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు.

 

వర్షాకాలంపై కీలక సమీక్ష.. పవన్ కీలక ఆదేశాలు 

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ఠ‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణ తేజతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

 

"వర్షాకాలంలో నిలిచి ఉన్న నీటితో దోమలు పెరిగి, పైపులైన్ల లీకేజీల వల్ల తాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది. ప్రతి గ్రామ పంచాయతీ ప్రజారోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలి. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. అన్ని గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు అందుబాటులో ఉంచి, అవసరమైన చోట తక్షణం వినియోగించాలి" అని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

Search
Categories
Read More
SURAKSHA
Shri Priyank Kishore, IAS: Young Visionary in Governance
A dynamic young IAS officer whose commitment to transparent governance, efficient public...
By Lokeshwari Panthadi 2026-07-20 10:43:21 0 194
Andhra Pradesh
రైళ్లల్లో వీళ్ళకి టికెట్ అవసరం లేదు ఫ్రీగా జర్నీ
రైళ్లల్లో వీరికి టికెట్ అవసరం లేదు.. ఫ్రీగా జర్నీ!   రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు పిల్లల...
By Rajini Kumari 2026-06-06 11:23:38 0 385
SURAKSHA
Mir Mohammed Ali, IAS: Inspiring Leadership in Public Service
The Journey Begins "The true measure of an administrator is not the authority...
By Fathima Safa 2026-07-15 10:18:07 0 128
Telangana
C M Revanth reddy meets Amith Shah in Delhi
తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్య‌ను...
By G k Nookala 2026-03-04 18:04:16 0 313
BMA
Newsroom Wellbeing: Breaking Free from 24/7 Burnout
The relentless demand to publish breaking news every few minutes has created an unprecedented...
By JoinBMA 2026-08-24 05:57:27 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com