ఈరోజు (24-06-2026) సాయంత్రం కనిగిరి పట్టణంలోని MBR ఫంక్షన్ హాల్లో నిర్వహించిన డి. విజయ్ కుమార్ గారు (టెక్నికల్ ఆఫీసర్, PR QA & QC డివిజన్, పర్చూరు) పదవీ విరమణ సన్మాన కార్యక్రమo

0
112

ఈరోజు (24-06-2026) సాయంత్రం కనిగిరి పట్టణంలోని MBR ఫంక్షన్ హాల్లో నిర్వహించిన డి. విజయ్ కుమార్ గారు (టెక్నికల్ ఆఫీసర్, PR QA & QC డివిజన్, పర్చూరు) పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు, యర్రగొండపాలెం నియోజకవర్గం టిడిపి ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ ముక్కు కాశీ రెడ్డి గారు డి. విజయ్ కుమార్(బాబ్జి ) గారిని సన్మానించి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గూడూరి ఎరిక్షన్ బాబు గారు మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలో ఎన్నో సంవత్సరాల పాటు నిబద్ధతతో, నిజాయితీతో విధులు నిర్వహించి శాఖ అభివృద్ధికి విశేష సేవలు అందించిన డి. విజయ్ కుమార్ గారి సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ఆయన చూపిన కృషి, అంకితభావం యువ ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమేనని, సమాజ సేవకు కాదు అని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా తన అనుభవంతో సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. అనంతరం డి. విజయ్ కుమార్ గారికి శాలువా కప్పి సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఈరోజు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ప్రభుత్వం...
By Sadaq Sadaq 2026-08-15 13:03:55 1 130
Telangana
ఆర్టీసీ కార్మికుల సమ్మెకి సంపూర్ణ మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు
మంచిర్యాల :కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని...
By Avunoori Mahesh 2026-04-23 08:34:41 0 188
Andhra Pradesh
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Private Bus Accident | NELLORE
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.   ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు...
By VALLERU SIMHADRI 2026-09-19 13:31:52 0 108
Andhra Pradesh
పుంగనూరు: గ్రానైట్ లారీలకు రూ 1. 82 లక్షల ఫైన్
చిత్తూరు జిల్లా, రొంపిచర్ల క్రాస్ వద్ద శనివారం అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న రెండు లారీలను ఎస్సై...
By Kothuru Murali 2026-04-19 11:13:39 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com