రూ.55 లక్షలతో 8 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.|

0
188

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 278వ డివిజన్ గాజులరామారం పరిధిలోని శ్రీరాంనగర్-బి, ఎమ్‌ఎఫ్ ఫంక్షనల్ హాల్ ప్రాంతంలో రూ.55 లక్షల వ్యయంతో చేపట్టనున్న 8 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.

ఆ ప్రాంతంలోని రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన కొలన్ హన్మంత్ రెడ్డి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిధుల ద్వారా రూ.55 లక్షలు మంజూరు చేయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే తమ లక్ష్యమని, నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.

అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేసిన కాలనీ వాసులు కొలన్ హన్మంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి లాయక్, బోయిని వెంకటేష్, శ్రీధర్ వర్మ, సతీష్ బాబు, మాయిన్ భాయ్, కాలనీ అధ్యక్షుడు మస్జీద్ భాయ్, హరీష్, ఆఫ్జాల్, శ్రీనివాస్ రావు, రహీమ్, ఖలీమ్, అజయ్, పాషా తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఈగల్ ఆపరేషన్ ఆన్ గంజా యి హాట్ స్పాట్స్ విజయవాడ
*Press Note*    *Eagle Operation on Ganja Hotspots*    *EAGLE Team,...
By Rajini Kumari 2025-12-19 13:05:48 0 258
SURAKSHA
Shri Ronald Rose, IAS: Champion of People-Centric Governance
From Grassroots Governance to Citizen-Centric Administration—An IAS Officer Dedicated to...
By Lokeshwari Panthadi 2026-07-09 09:17:21 0 193
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:నా వద్ద అన్ని ప్రూఫ్ లు ఉన్నాయి.. బీపీఎం
తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం...
By Kothuru Murali 2026-02-24 10:48:11 0 185
Andhra Pradesh
పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిశీలించిన డీఎస్పీ పావని
అన్నమయ్య జిల్లా, పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం మదనపల్లె డిఎస్పి పావని పరిశీలించారు....
By Kothuru Murali 2026-04-25 03:50:36 0 123
Andhra Pradesh
పుంగనూరులో తాడుతో ఆటోను లాగిన సీపీఐ నాయకులు
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా మంగళవారం సిపిఐ నాయకులు ఆటో...
By Kothuru Murali 2026-06-09 13:35:56 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com