గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ డిమాండ్

0
196

🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత ఆవాజ్ న్యూస్   ప్రతినిధి జగదీష్ 

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నూతన విద్యా సంవత్సరం 2026-27 ప్రారంభమైన నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గిరిజన శాఖ అభివృద్ధి జిల్లా అధికారి రమాదేవి గారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అనేక ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో కనీస సౌకర్యాల లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు సోకకుండా అన్ని పాఠశాలలు, హాస్టళ్లలో క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. అదేవిధంగా జిల్లాలోని కొన్ని ఆశ్రమ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వర్షాల కారణంగా విద్యార్థుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టి సురక్షితమైన వాతావరణంలో విద్యను అందించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని పాఠశాలలు, హాస్టళ్లలో తాగునీరు మరియు విద్యుత్ సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అన్ని విద్యాసంస్థల్లో నిరంతర తాగునీరు, విద్యుత్ సరఫరా కల్పించాలని కోరారు. అలాగే జిల్లాలో నిర్మాణంలో ఉన్న గిరిజన ప్రాథమిక పాఠశాల భవనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని దుర్గం దినకర్ విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
Vinay Kumar Gadge, IPS: A Visionary Guardian of Justice
A dedicated IPS officer of the AGMUT Cadre, Vinay Kumar Gadge has earned recognition for his...
By Lokeshwari Panthadi 2026-07-22 07:20:26 0 235
Prop News
The Green Premium Takes Over Commercial Office Spaces
The mandate for sustainable commercial real estate has officially reached a tipping point. As of...
By Dunna Jessicaruth 2026-05-20 10:52:39 0 158
Andhra Pradesh
ఆర్టీసీ గుడ్ న్యూస్.. కొరియర్స్, పార్సిల్స్ డోర్ డెలివరీ ఫ్రీ, ఎన్ని కిలోమీటర్ల వరకంటే..?
ఏపీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు డిసెంబర్ 20 నుంచి నెల రోజుల పాటు...
By John Baji 2025-12-31 01:34:53 0 215
Andhra Pradesh
చింతూరు ఐటిడిఏ ముందు గిరిజనుల ధర్నా!
పోలవరం జిల్లా కేంద్ర రంపచోడవరంలో ఈరోజు  గిరజన చట్టాల సాధనకై జరుగుతున్న మహాగర్జన సభకు...
By Shyamala Yadagiri 2026-07-20 06:59:43 0 194
Andhra Pradesh
పుంగనూరు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం మధ్యాహ్నం పుంగనూరు పట్టణంలో పర్యటించారు. మదనపల్లె...
By Kothuru Murali 2026-01-01 05:36:12 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com