సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు.

0
72

X

సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు

25-06-2026 Thu

Andhra

CI Nagaraju shifted to Rajahmundry jail in Sai Krishna disappearance case

విజయవాడ కస్టడీ డెత్ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు

విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

గాదె సాయి కృష్ణ మృతి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం

ఆధారాలు తారుమారు చేశారనే ఆరోపణలపై విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన విజయవాడ కస్టడీ మరణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సస్పెండైన కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ఎస్.ఎస్.వి.వి. నాగరాజుకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అధికారులు నిన్న ఆయనను భారీ భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

 

మంగళవారం సుమారు ఐదు గంటల పాటు విచారించిన అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నాగరాజును అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, జులై 8 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, పోలీసులు మూడు ప్రత్యేక వాహనాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య నాగరాజును విజయవాడ నుంచి రాజమండ్రికి తరలించారు.

 

గాదె సాయికృష్ణ (25) అనే యువకుడి అదృశ్యం, కస్టడీ మరణం కేసులో సీఐ నాగరాజు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మే 9న మార్కాపురం నుంచి సాయికృష్ణను అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారని, అక్కడ చిత్రహింసలకు గురిచేయడం వల్లే అతను మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాయికృష్ణ మరణానంతరం ఆధారాలు మాయం చేసేందుకు సీసీటీవీ ఫుటేజీని తొలగించి, మృతదేహాన్ని విద్యుత్ శ్మశానవాటికలో దహనం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

ఈ ఘటనపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఐజీ ఎం. రవిప్రకాశ్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో ‘సిట్’ను ఏర్పాటు చేసింది. అక్రమ నిర్బంధం, కస్టడీ హింస, హత్య, ఆధారాల తారుమారు వంటి అంశాలపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై కూడా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. 

Search
Categories
Read More
Uttar Pradesh
CM Yogi Felicitates Instructors, Touts 96% School Infrastructure Upgrade
Uttar Pradesh Chief Minister Yogi Adityanath addressed a felicitation ceremony for part-time...
By Dunna Jessicaruth 2026-05-18 10:14:55 0 130
Telangana
"ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి" కేసీఆర్
"ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి" ‎వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్ఎస్...
By Ponnala Srinivasrao 2026-07-28 01:12:25 0 155
Delhi - NCR
Global Diplomacy Takes Center Stage at Bharat Mandapam
New Delhi has transformed into a high-stakes diplomatic hub today as External Affairs Minister S....
By Dunna Jessicaruth 2026-05-15 07:43:17 0 272
Andhra Pradesh
పుంగనూరు: అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త.
పుంగనూరు మండలం, మంగళం గ్రామంలో బుధవారం అనుమానంతో భార్య మౌనిక గొంతును భర్త అశోక్ కత్తితో కోశాడు....
By Kothuru Murali 2026-01-28 09:36:18 0 217
Andhra Pradesh
మదనపల్లిలో హ్యాండ్లూమ్ దుకాణంలో అగ్నిప్రమాదం.
మదనపల్లి పట్టణం నీరుగట్టుపల్లిలో సోమవారం హ్యాండ్లూమ్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. శివరాత్రి...
By Pagadala Venkateswar 2026-02-17 05:21:50 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com