ఇది ప్రజా పాలన, ఫామ్ హౌస్ పాలన కాదు బండి రమేష్ ఘాటు వ్యాఖ్యలు

0
267

బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో 

కుక్కట్పల్లి mla మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రమే అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ గారు పేర్కొన్నారు.

 

మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి అవమానకర చర్యలు జరగడం లేదని, లబ్ధిదారులు నిజమైన వారేనని నిర్ధారించడానికి మాత్రమే ఆధార్ ధృవీకరణ, బయోమెట్రిక్ లేదా ఇతర గుర్తింపు ప్రక్రియలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పారదర్శకత, అవినీతి నివారణ, నకిలీ లబ్ధిదారులను అరికట్టడమే ఈ ప్రక్రియల ఉద్దేశమని తెలిపారు. బి ఆర్ఎస్ నాయకుల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారటం వల్ల అభద్రతాభావంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు

 

బీఆర్ఎస్ నాయకులు మహిళల గౌరవం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, పదేళ్ల పాలనలో మహిళలపై జరిగిన ఎన్నో ఘటనలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం మానుకోవాలని హితవు పలికారు. 

 

అలాగే చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్నికలతో ముడిపెట్టడం నిరాధార ఆరోపణ మాత్రమేనని, ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, అలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే విచారణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

 

"సంక్షేమ కార్యక్రమాల్లో పారదర్శకతను అవమానంగా చూపించడం బీఆర్ఎస్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు" అని *ఇది ప్రజా పాలన అని ఫామ్ హౌస్ పాలన కాదు అని బండి రమేష్ గారు పేర్కొన్నారు*.

Search
Categories
Read More
Andhra Pradesh
తేది :16.6.2026 కొత్తూరు గ్రామం వెలుగొండ ప్రాజెక్ట్ ====
తేది :16.6.2026. కొత్తూరు గ్రామం.వెలుగొండ ప్రాజెక్ట్ =======  ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆగస్టు...
By Chennaiah Kati 2026-06-16 09:10:49 0 115
Andhra Pradesh
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత చర్యలు
పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత చర్యలు ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు...
By Chennaiah Kati 2026-03-08 08:17:44 0 386
Andhra Pradesh
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద...
By Chennaiah Kati 2026-06-14 07:03:02 0 136
Andhra Pradesh
నకిలీ బంగారం పేరుతో మోసం.. ఏడుగురు అరెస్ట్.
జేసీబీ పనుల్లో బంగారం దొరికిందని, తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న...
By Pagadala Venkateswar 2026-06-20 04:34:36 0 99
Karnataka
Karnataka's IT and Startup Ecosystem Driving Innovation
Karnataka continues to strengthen its position as India's leading technology and startup hub...
By Fathima Safa 2026-06-17 06:24:06 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com