చీరాలలో ఆటో డ్రైవర్ నిజాయితీ

0
325

ఆటో డ్రైవర్ నిజాయితీ : ఈ రోజు ఉదయం సుమారు 8 గంటలకు దాసరి పద్మావతి అనే మహిళ చీరాల లోని కొత్తపేటలోని BSR కాలనీ లో బస్టాండ్ వరకు వెళ్ళుటకు తన భర్తతో కలిసి ఆటో ఎక్కింది. అప్పుడు ఆమెతో పాటు ఒక బ్యాగ్ కూడా ఉన్నది. ఆ బ్యాగ్ లో ఎనిమిది సవర్ల బంగారం మరియు 7000 రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఈవిడ చీరాలలోనే బస్టాండ్ కి వెళ్లి అక్కడ బ్యాగ్ ను ఆటోలో మర్చిపోయి.. తన భర్తతో కలిసి ఆటో దిగి బస్టాండ్ లోకి వెళ్ళింది. బస్టాండ్ లోపలికి వెళ్ళిన తర్వాత తను ఆటోలో బ్యాగ్ మర్చిపోయినట్లుగా కనుక్కొని వెంటనే చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చింది. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ రాస్తున్న సమయంలోనే ఆటో డ్రైవర్ మొగిలి శాంత కుమార్ ఎంతో నిజాయితీతో ఆ బ్యాగ్ ను తీసుకొచ్చి స్టేషన్లో అప్పగించాడు. ఆ మహిళ తన బ్యాగ్ లో ఉన్న వస్తువులని చెక్ చేసుకుని బంగారం, డబ్బులు అన్ని సరిగా ఉన్నట్లుగానే గుర్తించింది. ఆటో డ్రైవర్ మొగిలి శ్యాంత కుమార్ యొక్క నిజాయితీకి బాధిత మహిళా మరియు ఒకటో పట్టణ పోలీస్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

Search
Categories
Read More
Telangana
అగ్నివీర్ తాండా యువకుడు
రామయంపేట మండలం పర్వతాపూర్ పరిధిలోని బాపనయ్య తాండాకు చెందిన విస్లావత్ అనిల్ కుమార్ భారత సైన్యంలో...
By Katiyala JeevanRaj 2026-06-03 12:51:51 0 342
Andhra Pradesh
HOD మరియు సెక్రెటరీ ఉద్యోగులకు రాజధానిలో ఇళ్ల స్థలాల అంశాన్ని సీఎం దృష్టికి కి తీసుకువచ్చిన ఏపీ ఎన్జీవో నేతలు ఏ విద్యాసాగర్ డివి రమణ
    *కొత్త ఏడాదిలో నూత‌నుత్తేజంతో ప‌నిచేద్దాం* - *స‌మ‌ష్టి...
By Rajini Kumari 2025-12-30 09:53:30 0 218
Andhra Pradesh
మదనపల్లె: బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్.
మదనపల్లెలో అధికారుల నిర్లక్ష్యంపై సీటీఎంకు చెందిన సయ్యద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను...
By Pagadala Venkateswar 2026-03-02 10:08:58 0 189
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీలో చేరిన 150 వైసీపీనుండి కార్యకర్తలు
*అన్నమయ్య జిల్లా* *రాయచోటి నియోజకవర్గం* *లక్కిరెడ్డిపల్లె మండలం* *18-07-2026*   *మంత్రి...
By Benguluri Madhubabu 2026-07-18 16:01:51 0 255
Andhra Pradesh
రాయచోటి వీరభద్ర స్వామి ఆలయంలో నిత్య అన్న ప్రసాద వితరణ ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్
రాయచోటి పట్టణంలో వెలసినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యం ప్రతిరోజూ...
By Benguluri Madhubabu 2026-04-06 10:32:39 0 362
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com