హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
168

 

(23.06.2026),

 

*హెవీ డ్రైవింగ్ శిక్షణపై విధించిన ఆంక్షలు తొలగించాలని మంత్రికి వినతి* 

 

*హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం...మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి* 

 

రాష్ట్రవ్యాప్తంగా హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల కార్యకలాపాలపై ఏర్పడిన సమస్యల నేపథ్యంలో వివిధ జిల్లాలకు చెందిన శిక్షణ కేంద్రాల యజమానులు మంగళవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని తాడేపల్లి లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

 

పరివాహన్ పోర్టల్‌లో హెవీ డ్రైవింగ్ శిక్షణ ప్రక్రియను నిలిపివేయడం వల్ల శిక్షణార్థులు లైసెన్సులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, శిక్షణ కేంద్రాలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని వారు మంత్రికి వివరించారు. హెవీ డ్రైవింగ్ శిక్షణ ద్వారా అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొంటూ విధించిన ఆంక్షలను తొలగించాలని కోరారు.

 

వారి వినతిని ఆలకించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ అంశాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులతో చర్చించి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రెసిడెన్షియల్ ఏరియాలో మద్యం షాపు. పెడుతున్నారని మహిళ ల ఆందోళన
విశాఖ పట్నం నరసింహ నగర్‌లో ఓ వ్యక్తి మద్యం షాపు పెట్టేందుకు  ప్రయత్నిస్తున్నాడని...
By Mobbu Venkatramana 2026-02-13 04:31:22 3 856
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
By Kothuru Murali 2026-02-22 11:20:31 0 167
Andhra Pradesh
44వ జాతీయ యోగ చాంపియన్ షిప్ 2025-26 ప్రారంభోత్సవ కార్యక్రమం..
జిల్లెలమూడి శ్రీవిశ్వ జనని పరిషత్... అమ్మ ప్రాంగణంనందు ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం.. బాపట్ల :...
By Gadiyapudi Narendra 2025-12-27 11:05:28 0 700
Telangana
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు సర్వర్ డౌన్‌ కారణంగా ఉదయం నుంచి...
By Veeresh Kumar 2026-03-24 16:44:18 2 1K
BMA
Patience in Reporting: Multi-Month Probes Expose Scams
Exposing complex financial fraud, procurement corruption, and policy failures requires immense...
By JoinBMA 2026-08-24 05:51:58 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com