లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్ సంస్థ సందర్శించిన APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు

0
113

లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను సందర్శించిన APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి ఆటోనగర్‌లోని ఐటీ పార్క్‌లో గల ది హెర్బ్స్ స్క్వేర్ భవనంలో ఉన్న లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను, ఆత్మీయ ఆహ్వానం మేరకు APMSIDC చైర్మన్ & జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు సందర్శించారు.

ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి సంస్థ ప్రముఖులు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలుకుతూ, శాలువాతో సత్కరించారు.

తదుపరి, స్టూడియో హెడ్ తాడిపర్తి రవి, సహ వ్యవస్థాపకులు సాయి కృష్ణ ఉడతా, మేఘన తిరుమలశెట్టి, వ్యాపార నిర్వహణ మేనేజర్ అమీనా ఖండ్కర్‌లతో ఆయన సమావేశమై విజువల్ ఎఫెక్ట్స్ (VFX) రంగంలో ఉన్న అవకాశాలు, ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు, మరియు గేమింగ్, AVGC-XR రంగ అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

అలానే, మంగళగిరిలోనే ప్రత్యేకతగా ఈ సంస్థ విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు అందిస్తున్న సేవలను, బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన పలు చిత్రాల్లో చేసిన కృషిని ఆయన ఆసక్తిగా తెలుసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ యువత ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో AVGC-XR రంగం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ రంగం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే కాకుండా సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి స్టూడియోలు మరింతగా అభివృద్ధి చెంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

కూటమి ప్రభుత్వం సాంకేతిక రంగ అభివృద్ధి, నూతన ఆవిష్కరణల ప్రోత్సాహం, పరిశ్రమల పురోగతికి పూర్తి కట్టుబాటుతో పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారితో కంపెనీ సాధించిన విజయాలు, ఆవిష్కరణలు, ప్రస్తుత ప్రాజెక్టులపై వివరంగా చర్చించనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా, పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఏపి ఫిల్మ్ కార్పొరేషన్(APSFTVTDC) వైస్ చైర్మన్ మెహర్ రమేశ్ గారి దృష్టికి, అలానే శ్రీ పవన్ కళ్యాణ్ గారి క్రియేటివ్ సంస్థకు సంబంధించిన ఆధునిక సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టుల విషయాలను వారి పరిశీలనకు తీసుకెళ్లి, ఈ సంస్థ ద్వారా అధునాతన సాంకేతిక విలువలతో కూడిన ప్రాజెక్టులను అందించే అవకాశాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

అత్యంత నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లు కలిగిన ఈ సంస్థ భవిష్యత్తులో మరింత విశేషంగా రాణిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఫీచర్ ఫిల్మ్స్, కమర్షియల్స్, గేమింగ్ ట్రైలర్స్, మ్యూజిక్ వీడియోలు తదితర రంగాల్లో అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ సేవలను అందిస్తున్న లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ను సృజనాత్మక సాంకేతిక రంగంలో ముందంజలో నిలపడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయంలో రాహుకాల పూజలు, అన్నదానం
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయంలో రాహుకాలంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో...
By Kothuru Murali 2026-06-13 15:47:24 0 113
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ త్రివర్ణ రంగుల దుస్తులు, జాతీయ జెండాలతో సందడి చేసిన చిన్నారులు. ఆకట్టుకున్న దేశభక్తి వేషధారణ.
Madanapalle: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చిన్నారులు వినూత్న రీతిలో దేశభక్తిని చాటారు....
By Pagadala Venkateswar 2026-08-15 05:18:01 0 70
Andhra Pradesh
మాలేపాడులో దారి సమస్య.. రహదారి దిగ్బంధం.
మదనపల్లి మండలం మాలేపాడులో టీడీపీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ కారణంగా, బుధవారం 13 పల్లెలకు...
By Pagadala Venkateswar 2026-06-11 05:19:01 0 98
Andhra Pradesh
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25929 లక్షల రూపాయల అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ...
By Chennaiah Kati 2026-02-03 02:28:57 0 425
Telangana
జీహెచ్ఎంసీకి రికార్డు ఆదాయం.. రూ.1,172 కోట్లు!
హైదరాబాద్: 2025-26 ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆదాయం...
By Sidhu Maroju 2026-04-03 18:05:05 0 250
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com