జీహెచ్ఎంసీకి రికార్డు ఆదాయం.. రూ.1,172 కోట్లు!

0
250

హైదరాబాద్: 2025-26 ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆదాయం గణనీయంగా పెరిగింది. నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా మొత్తం రూ.1,172.08 కోట్ల ఆదాయం సమకూరినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.

గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,138.44 కోట్ల ఆదాయం నమోదు కాగా, ఈసారి అదనంగా రూ.34.36 కోట్ల వృద్ధి నమోదైంది. ముఖ్యంగా ‘బిల్డ్ నౌ’ పోర్టల్ ద్వారా అనుమతులు, సర్టిఫికెట్లు జారీ చేయడం ఆదాయం పెరగడానికి దోహదపడింది.

2025 మార్చి నెలలోనే 15,536 నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరు చేయడం గమనార్హం. నగర అభివృద్ధి వేగం పెరుగుతున్న దానికి ఇది స్పష్టమైన సంకేతంగా అధికారులు పేర్కొన్నారు.

అదే సమయంలో క్యూర్ అర్బన్ రీజియన్‌లో ఆస్తి పన్ను వసూళ్లు కూడా భారీగా నమోదయ్యాయి. మొత్తం రూ.2,558.8 కోట్ల పన్ను వసూలు కాగా, జీహెచ్ఎంసీలో రూ.995.82 కోట్లు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.100.36 కోట్లు, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.562.62 కోట్లు వసూలయ్యాయి.

మార్చి నెలలోనే రూ.453 కోట్ల బకాయిలు వసూలు చేయగా, మార్చి 31 ఒక్కరోజే రూ.162.94 కోట్ల ఆదాయం నమోదు కావడం విశేషం. ఈ వసూళ్లు నగర ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తున్నాయి.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా విచ్చేసిన గద్య అనురాధ
*మహిళల సాధికారతకు విద్యే పునాది : గద్దె అనురాధ*            ...
By Rajini Kumari 2026-03-07 12:07:36 0 386
Andhra Pradesh
పుంగనూరు:అనుమతి లేని లేఅవుట్లు తొలగింపు.
అనుమతి లేని లేఅవుట్లు తొలగింపు... పుంగనూరులో కొరడా ఝులిపించిన అధికారులు...   పుంగనూరు...
By Kothuru Murali 2026-01-14 16:26:02 0 205
Telangana
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఒక రోడ్డు...
By Pinnehasan Odela 2026-02-02 07:24:26 0 314
Telangana
చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత.
*వరంగల్ జిల్లా :*   చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత. ...
By Ellandula Sandeep 2026-01-12 17:44:18 0 626
Andhra Pradesh
రాజధాని కార్మిక వాడల్లో డిసెంబర్ 15న ఎర్రజెండాల ఆవిష్కరణ
*ఉండవల్లిలో మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి శనివారం నాడు మాట్లాడుతున్న సిఐటియు గుంటూరు జిల్లా...
By Rajini Kumari 2025-12-13 09:59:44 0 303
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com