అన్నదాత సుఖీభవ: రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ చేసిన సీఎం చంద్రబాబు.

0
107

చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుట్లలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు విడుదల

తొలి విడతగా ఒక్కో రైతుకు రూ.7 వేల చొప్పున ఆర్థిక సాయం

కడప, కర్నూలులో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన

వ్యవసాయ స్టాళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి

రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుట్ల వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన బటన్ నొక్కి 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లను జమ చేశారు. ఈ సాయంతో ప్రతి రైతు ఖాతాలో తొలి విడతగా రూ.7,000 జమ అయ్యాయి.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి, అంతకుముందు వ్యవసాయ, ఉద్యానవన శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. రైతులు, మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ప్రాసెసింగ్ యూనిట్లు, వర్మీ కంపోస్టు తయారీ, నూనె గింజల మిషన్ వంటి ప్రదర్శనల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఎం కిసాన్ పథకంపై ప్రధాని మోదీ ప్రసంగించిన కార్యక్రమాన్ని రైతులతో కలిసి సీఎం వీక్షించారు.

 

ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా కడప, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్లు 2026 డిసెంబరు నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: సింహ వాహనంపై మృత్యుంజయే స్వర స్వామి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలోని శ్రీ అభిష్టద మృత్యుజయేశ్వర స్వామి...
By Kothuru Murali 2026-04-23 15:10:30 0 132
Andhra Pradesh
Ayyanna Patrudu: అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు... నో పే!: అయ్యన్నపాత్రుడు.
స్పీకర్ల మహాసభలో అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు 'నో వర్క్.. నో పే' విధానం అమలు చేయాలన్న అయ్యన్న...
By Pagadala Venkateswar 2026-01-21 09:51:12 0 195
Andhra Pradesh
ఆరు జిల్లాల కలెక్టర్ల ప్రజెంటేషన్
రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉత్తమ విధానాలు (best practices) విజయగాధలుపై ఆరుగురు జిల్లా...
By Rajini Kumari 2025-12-18 08:23:31 0 230
Andhra Pradesh
రేపు ఉదయం నుంచి మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ టోర్నమెంట్
*రేపు ఉదయం నుంచే మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్*    *నారా లోకేష్...
By Rajini Kumari 2025-12-20 13:44:42 0 215
Andhra Pradesh
విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపుతున్న కూటమి ప్రభుత్వం
విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపుతున్న కూటమి ప్రభుత్వం. దర్శి మండల కేంద్రంలోని...
By Chennaiah Kati 2026-07-07 02:59:49 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com