చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు..

0
108

 

చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో!

20-06-2026 Sat 16:49

Andhra

Chandrababu Naidu drinks Ragi Java with children at Anganwadi center photos

లింగంగుంట్ల అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు

చిన్నారులతో కలిసి నేలపై కూర్చుని రాగి జావ సేవించిన ముఖ్యమంత్రి

అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ

రాష్ట్రంలోని 44,346 అంగన్‌వాడీలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ ప్రారంభం

ప్రకృతి సేద్యంపై రైతులతో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్నారులతో కలిసిపోయారు. వారితో పాటే నేలపై కూర్చుని రాగి జావ తాగారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం నాడు ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర, అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గ్రామానికి విచ్చేసిన సీఎం.. తన పర్యటనను అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించడంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులతో సరదాగా ముచ్చటిస్తూ, వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు.

 

ముఖ్యమంత్రి రాక సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రం టీచర్, సహాయకురాలు ఆయనకు స్వాగతం పలికారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'నెట్ జీరో' విధానంలో భాగంగా, రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను కాలుష్యరహితంగా మార్చే కార్యక్రమానికి సీఎం ఇక్కడే శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.32 కోట్ల వ్యయంతో 44,346 అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు, స్టీల్ పాత్రలను పంపిణీ చేసే బృహత్తర పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా లింగంగుంట్ల అంగన్‌వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్, కొత్త పాత్రలను స్వయంగా అందించారు.

 

ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. స్టాక్ వివరాలను పరిశీలించారు. అనంతరం, అంగన్‌వాడీ సహాయకురాలు కొత్త ఇండక్షన్ స్టవ్‌పై సీఎం సమక్షంలోనే రాగి జావ తయారు చేశారు. చంద్రబాబు చిన్నారులతో కలిసి కింద కూర్చుని ఆ జావను స్వీకరించారు. ఆయన చర్య అక్కడున్న వారిని ఆకట్టుకుంది. పర్యటనలో భాగంగా పచ్చదనాన్ని ప్రోత్సహిస్తూ అంగన్‌వాడీ ప్రాంగణంలో సిబ్బందితో కలిసి మొక్క నాటారు.

 

అన్నదాతలకు అండగా.. ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు

ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు 'అన్నదాత సుఖీభవ' కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మొదటి విడత ఆర్థిక సాయాన్ని ఆయన బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.3,125 కోట్లు జమ అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని రైతులతో ముఖాముఖి నిర్వహించి, ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగవుతున్న పంటల వివరాలు, రైతుల అనుభవాలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కలెక్టర్ గారిని డిఎస్పి గాని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఎస్పీ మహేందర్ లను శుక్రవారం పుంగనూరు...
By Kothuru Murali 2026-01-02 13:02:45 0 246
Gujarat
Gujarat Strengthens Women Empowerment Initiatives 2026
Gujarat continues to advance women’s empowerment through initiatives focused on education,...
By Fathima Safa 2026-07-06 07:19:24 0 237
Andhra Pradesh
హార్సిలీహీల్స్ ఘాట్ రోడ్డులో టాటా ఏస్ బోల్తా.. పలువురికి గాయాలు.
మదనపల్లె నుంచి ఆదివారం 10 మంది కుటుంబ సభ్యులతో హార్సిలీహీల్స్ సందర్శనకు వెళ్లిన టాటా ఏస్ వాహనం,...
By Pagadala Venkateswar 2026-03-23 05:52:03 0 205
Telangana
సుల్తానాబాద్ : కనగర్తి లో బొడ్రాయి ఉత్సవాలు ప్రారంభం
పెద్దపల్లి మండలం కనగర్తిలో గ్రామ సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని బొడ్రాయి...
By Sunka Santhosh 2026-04-29 17:10:23 0 196
Andhra Pradesh
ప్రజలకు గంజాయి పై అవగాహన కల్పించిన పోలీసులు
పుంగనూరు పట్టణంల ో గంజాయ ి విక్రయిస్తూ పట్టుబడ్డ వ్యక్తులకు జిల ్ ల ా ఎస ్ స ీ తుషార ్ డూడ ి...
By Kothuru Murali 2025-12-24 04:51:07 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com