మున్సిపల్ కార్మికులు కన్నీటి దారా ఆపాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్రీ సురేష్ కుమార్

0
157

మున్సిపల్ కార్మికుల కన్నీటి ధారను ఆపాలి

 

Ap మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్రిసురేష్ కుమార్ 

 

38 వేల మంది మున్సిపల్ కార్మికుల కన్నీటి ధారను ఆపడానికి చర్యలు చేపట్టాలని 

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దశలవారీ ఆందోళన కార్యక్రమంలో

 

ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్రి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు.

 

  శనివారం రాయచోటి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం ఆయన మాట్లాడారు.

 

"ముందు కార్మికులకు న్యాయం చేయండి... 

 

తర్వాత విజయోత్సవాలు చేసుకోండి. కార్మికుల కన్నీళ్లపై విజయోత్సవాలు అంగీకరించం." 

 

కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలేని ప్రభుత్వానికి విజయోత్సవాలు చేసే నైతిక హక్కు లేదు.

 

రెండేళ్ల పాలనలో కార్మికులకు చేసింది ఏమిటి? ఇదే మా ప్రశ్న.

 

 రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దసలవారీ ఆందోళన కార్యక్రమంలో

 

 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, ఏ ఒక్క మున్సిపల్ కార్మికుడి సమస్యను కూడా పరిష్కరించలేదని ఆయన మండిపడ్డారు. 

 

ఈ సందర్భంగా వర్రి సురేష్ కుమార్ మాట్లాడుతూ... "

 

గత రెండేళ్ల కాలంలో మరణించిన లేదా రిటైర్ అయిన మున్సిపల్ కార్మికుల స్థానంలో, వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద తిరిగి పనులు కల్పించకుండా ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది.

 

 మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా అప్కాస్ వ్యవస్థను రద్దు చేసి, పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ, నిర్వహణను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం చూస్తోంది.

 

 స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సింది పోయి కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు కార్మికులను బానిసలుగా మారుస్తున్నారు. 

 

డైలీ వేజ్ కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రోజుకు రూ. 585 వేతనం అమలు చేయడం లేదు. 

 

స్కూల్ స్వీపర్లు, పార్క్ కూలీలు, డైలీ వేజ్ కార్మికులందరినీ తక్షణమే అప్కాస్లోకి చేర్చాలి. 

 

రెగ్యులర్ కార్మికులకు రావాల్సిన డీఏలు, సరెండర్ లీవుల ఎన్క్యాష్మెంట్, గ్రాట్యుటీ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఈ సమస్యలను గాలికొదిలేసి 'సుపరిపాలన వారోత్సవాలు' జరపడం విడ్డూరంగా ఉంది. 

 

మున్సిపల్ కార్మికులపై సాగుతున్న రాజకీయ పెత్తనాన్ని తక్షణమే ఆపాలని, 

 

1952 నుంచి 2008 వరకు అమలైన మున్సిపల్ కాలనీల విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలి” అని డిమాండ్ చేశారు. 

 

కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని వర్రి సురేష్ కుమార్ కోరారు.

 

 ఈ కార్యక్రమంలో CPI రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్ధిగల శ్రీనివాసులు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు నేలపాటి శ్రీనివాస్, కేశవరావు,రవి, బాలాజి, విష్ణువర్ధన్, రాచారాయుడు , వినయ్ సమావేశంలో

Search
Categories
Read More
Andhra Pradesh
ఇసుక క్వారీపై ధ్వజమెత్తిన టీ సుండుపల్లె మండలం రైతులు
ఈరోజు టి సుండు పల్లి మండలంలో పెద్దబలిజ పల్లి గ్రామం గుట్టకాడపల్లి మల్లక్క గారి పల్లి ఏటిగడ్డ...
By Benguluri Madhubabu 2026-03-22 07:34:19 0 302
Andhra Pradesh
Chandrababu Naidu: పొగాకు ముడి ఉత్పత్తులపై పన్ను సున్నా.. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన ఏపీ!
అన్ బ్రాండెడ్ ముడి పొగాకుపై సున్నా శాతం సుంకం బ్రాండెడ్ ఉత్పత్తులకు 18 శాతం ఎక్సైజ్ డ్యూటీ...
By Pagadala Venkateswar 2026-02-04 07:48:31 0 201
Andhra Pradesh
మిద్దెపై నుంచి పడి ఎంబీఏ విద్యార్థికి తీవ్ర గాయాలు.
పుంగనూరు మండలం కుక్కలపల్లిలో ఎంబీఏ విద్యార్థి గంగరాజు (24) తన స్నేహితుడి ఇంట్లో మిద్దెపై...
By Pagadala Venkateswar 2026-05-09 07:52:57 0 135
Telangana
"ఆదివారం నుంచి కనిపించని బాలుడు.. సమాచారం ఇవ్వాలంటూ పోలీసుల విజ్ఞప్తి.|
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా : బొల్లారం బజార్ ప్రాంతంలో ఏడు సంవత్సరాల బాలుడు అదృశ్యమైన ఘటన...
By Sidhu Maroju 2026-06-03 09:08:58 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com