ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు....దొంగలు బాబోయ్‌ దొంగలు… దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు

0
116

ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు....దొంగలు బాబోయ్‌ దొంగలు… దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు

మధ్యప్రదేశ్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా కదలికలపై ప్రకాశం, ఏలూరు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ధార్ జిల్లాకు చెందిన నిందితుల ముఠా రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో పలు ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. చీరాలలో గతంలో చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న ముఠాలతో ఈ గ్యాంగ్‌కు సంబంధాలు ఉండొచ్చన్న అనుమానంతో స్థానిక నేరస్థుల కదలికలపైనా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ చీరాల టూ టౌన్ సీఐ శశికుమార్ అనుమానితుల ఫొటోలతో పోస్టర్లను విడుదల చేశారు. పోస్టర్లలో ఉన్న వ్యక్తులు చోరీలు, దోపిడీ కేసుల్లో నిందితులని, వారి ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

పర్చూరులోనూ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పర్చూరు ఎస్‌ఐ పులి గోపి మాట్లాడుతూ, ధార్ గ్యాంగ్ కదలికలపై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత కొనసాగుతోందని తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ముగ్గురు అనుమానితుల కదలికలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతో ఈ ముఠా కదలికలను గుర్తించి నేరాలను అరికట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: హిందూ సమాజాన్ని జాగృతోచేయ rss కిలక పాత్ర.
హిందీసమాజాన్ని జాగృతం చేయడములో ఆర్ఎస్ఎస్ పాత్ర కిలకమణి అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ...
By Sadaq Sadaq 2026-03-19 17:06:00 0 225
Telangana
"ఏఐ శక్తి.. సైబర్ భక్తి" కాదు.. భద్రతకు కొత్త భయం.|
● Anthropic Claude మోడల్స్‌పై సంచలన ప్రకటన ● సైబర్ పరీక్షల్లో బయటపడిన భద్రతా లోపాలు ● ఏఐ...
By Sidhu Maroju 2026-07-31 13:21:31 0 253
Andhra Pradesh
పుంగనూరు మండలంలో ఘోరం
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం, భీమ గాని పల్లి పంచాయతీ, బోనపల్లిలో బుధవారం 70 ఏళ్ల వృద్ధురాలిపై...
By Kothuru Murali 2026-04-02 06:07:52 0 186
Andhra Pradesh
Sub registers get promotion to register.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్,...
By G k Nookala 2026-02-18 09:36:27 0 197
Telangana
అగ్నివీర్ తాండా యువకుడు
రామయంపేట మండలం పర్వతాపూర్ పరిధిలోని బాపనయ్య తాండాకు చెందిన విస్లావత్ అనిల్ కుమార్ భారత సైన్యంలో...
By Katiyala JeevanRaj 2026-06-03 12:51:51 0 349
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com