హాజీపూర్ పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్

0
247

మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో ఉన్న హాజీపూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలలో భాగంగా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సీఐ రవీందర్,ఎస్‌ఐ కిరణ్ కుమార్‌లు పుష్పగుచ్ఛం అందించి ఆయనకు స్వాగతం పలికారు.అనంతరం డీసీపీ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు.ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి,రిసెప్షన్ సెంటర్‌లోని సిబ్బందితో మాట్లాడి రికార్డులను తనిఖీ చేశారు.స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్‌లో వివరాల నమోదు,అప్‌లోడ్ ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల ఫైళ్లు, క్రైమ్ రికార్డులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ వ్యవహారాలపై సీఐ రవీందర్,ఎస్‌ఐ కిరణ్ కుమార్‌లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా డీసీపీ ఎగ్గడి భాస్కర్ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని,సీసీ కెమెరాల ఫుటేజీని నిరంతరం పర్యవేక్షిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి పోలీసు కానిస్టేబుల్ గ్రామ పోలీసు అధికారిగా గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవడంతో పాటు సమాచార వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలని సూచించారు.ప్రజల్లో చట్టాలపై,సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై,సైబర్ నేరాల పట్ల అప్రమత్తతపై అవగాహన కల్పించాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని తెలిపారు. అలాగే రహదారి భద్రత,ట్రాఫిక్ నియమాలు,హెల్మెట్, సీటు బెల్టు ధరించడం యొక్క ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.ప్రజల భద్రత దృష్ట్యా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, వాటి ప్రాముఖ్యతపై ప్రజలు,వ్యాపారుల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, గ్రామపంచాయతీలు, జాతీయ రహదారి ప్రాంతాల్లో ప్రమాదాల నివారణ కోసం నేషనల్ హైవే అథారిటీతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం రాత్రి పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. హాజీపూర్ పోలీస్ స్టేషన్ సీఐ,ఎస్‌ఐల ఆధ్వర్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని అభినందించిన డీసీపీ, ఇదే స్ఫూర్తితో మరింత నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు.ఈ తనిఖీలలో ఏసీపీ ప్రకాశ్,సీఐ రవీందర్, ఎస్‌ఐ కిరణ్ కుమార్‌లతో పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ కి ఘన నివాళి
*ప్రచురణార్థం* *18-01-2026*   *ఎంపీ క్యాంప్ కార్యాలయం లో ఎన్టీఆర్ కి ఘన నివాళి*  ...
By Rajini Kumari 2026-01-18 13:25:00 0 199
Telangana
కుతుబుల్లాపూర్ మరియు దుండిగల్ పరిసర ప్రాంతాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
కుతుబుల్లాపూర్ మరియు దుండిగల్ పరిసర ప్రాంతాల్లో ఏప్రిల్ 14న, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి...
By Ponnala Srinivasrao 2026-04-14 03:30:14 0 218
Odisha
Eco-Tourism Boost: Bhimmandali Heritage Site Open
Union Minister Dharmendra Pradhan inaugurated the Bhimmandali Eco Heritage Site in Sambalpur...
By Dunna Jessicaruth 2026-05-18 08:40:25 0 183
Telangana
రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు
  సూర్యామెహన్ మద్దూర్ మండల్      రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ...
By Vanmoj Suryamohan 2026-05-06 09:41:36 0 386
BMA
National Solidarity: Press Unifying Citizens in Crises
In moments of national tragedy, environmental panics, or external threats, the press demonstrates...
By JoinBMA 2026-08-21 10:48:19 0 59
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com