ఆసిఫాబాద్‌లో కలకలం దంపతుల అనుమానాస్పద మృతి

0
262

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్

ఆసిఫాబాద్, జూన్ 18 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఒక ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఆసిఫాబాద్ మండల పరిధిలోని కోసార గ్రామానికి చెందిన బానోత్ రాజు, అతని భార్య సునీత తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ఘటనతో కోసార గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఆసిఫాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రాథమిక వివరాలను సేకరించారు.అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసుల దర్యాప్తు దంపతుల మృతికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ ఏకీకృత కుటుంబ సర్వే ప్రశ్నలు: సర్వేలో అడిగేవి ఇవే.. ముందే సిద్ధంగా ఉండండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఏపీ ఏకీకృత కుటుంబ సర్వేను...
By John Baji 2025-12-27 11:19:24 0 234
Andhra Pradesh
అమరావతి లో ఆశా కార్య కర్తల సమావేశం
విశాఖ మధురవాడ యందు గల అమరావతిలో మంగళవారం ఉదయం 10గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 8మంది ఆశా...
By Mobbu Venkatramana 2026-03-10 08:56:22 0 344
Telangana
ఆల్వాల్ సిఐ ప్రశాంత్ చేతుల మీదుగా చలివేంద్రాల ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం...
By Sidhu Maroju 2026-04-03 15:50:32 0 291
Telangana
"పచ్చదనానికి శ్రీకారం!
"వనమహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-06-25 09:29:04 0 156
Tamilnadu
"జూన్ 1న ఆదేశాలు ఇచ్చా.. జూన్ 9న అధికారులు పని చేయలేదు: సీఎం రేవంత్".|
హైదరాబాద్ : తెలంగాణలో మాన్సూన్ వర్షాల నేపథ్యంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి...
By Sidhu Maroju 2026-06-15 12:23:27 0 396
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com