ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవం....MLA శ్రీ దొంతి మాధవ రెడ్డి గారు...

0
300

*దుగ్గొండి మండలంలో కొనసాగుతున్న గృహప్రవేశాల పరంపర*

భారత్ అవాజ్ న్యూస్: 18జూన్ నేడు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని పోనకల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులైన కందికొండ రజిత–సమ్మయ్య, రాసమల్ల సాంబలక్ష్మి–ప్రభాకర్, రాసమల్ల సుజాత కుటుంబాల నూతన గృహాల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు హాజరై రిబ్బన్ కటింగ్ చేసి గృహాలను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు...ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి గారు మాట్లాడుతూ, పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు శాశ్వత నివాసం కల్పించామని, అదే సంకల్పంతో నేడు ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని తెలిపారు...

నర్సంపేట నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు దక్కేలా చూడటం తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు చేర్చుతూ, ప్రజలకు అండగా నిలవడమే కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేకత అని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉప సర్పంచులు, నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు, మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...

Search
Categories
Read More
Manipur
Manipur Advances Sports and Youth Empowerment Initiatives
Manipur continues to strengthen its reputation as a sporting powerhouse through various sports...
By Fathima Safa 2026-06-24 11:41:04 0 223
Telangana
ప్రపంచ శాంతి కోసమే క్రైస్తవ ఉజ్జీవ సభనలు: ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్: కంటోన్మెంట్|  మడ్ ఫోర్డ్ హాకీ గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి కోసం ఫాదర్...
By Sidhu Maroju 2025-10-25 16:14:32 0 310
Andhra Pradesh
Nirmala Sitharaman Witnessed the signing of  MoUs during the launch of Cyient AI & Future Skills Hub at Digital Bhawan in Pedamainavanilanka (PM Lanka) village in the West Godavari district of Andhra Pradesh.
Nirmala Sitharaman witnessed the signing of  MoUs during the launch of Cyient AI &...
By Gadiyapudi Narendra 2025-12-28 16:49:24 0 321
Andhra Pradesh
శ్రీకాకుళం: కళాశాలల్లో ఇకపై 'ఫేషియల్ రికగ్నిషన్' హాజరు తప్పనిసరి
ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి పారదర్శకతను పెంచేందుకు విద్యాశాఖ కీలక...
By Manda Ramkumar 2026-03-28 06:38:14 0 542
Andhra Pradesh
ఉత్తరాంధ్రను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
ఉత్తరాంధ్రను కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న, పట్టణ...
By Boiena Rajesh 2026-08-24 10:17:35 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com