International drugs gang secret revealed

0
205

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.

 

రూ.1.06 కోట్ల విలువైన 213 కేజీల గంజాయి పట్టివేత.

 

ఐదుగురు నిందితుల అరెస్ట్.

 

చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు ఎస్పీ ప్రశంసలు. 

 

అనకాపల్లి, జూన్ 17, మేజర్ న్యూస్: అంతరాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలున్న భారీ గంజాయి అక్రమ రవాణా ముఠాను పరవాడ పోలీసులు పట్టుకున్నారని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలియజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరవాడ పోలీసులు లంకెలపాలెం జంక్షన్ వద్ద మెరుపు దాడి చేసి రూ.1,06,68,000 విలువైన 213.360 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షేక్ అజ్మల్ ఖాన్ (ఏ1) తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లా వాసి అని, ఇతనికి అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయన్నిరు. గతంలో శ్రీలంకలో 495 గ్రాముల మెథాంపెటమైన్, 8.583 కేజీల హాషిష్‌తో పట్టుబడి 2022 నుంచి 2025 వరకు ‘బూస్సా హై సెక్యూరిటీ జైలు’లో రిమాండ్‌లో ఉన్నాయన్నారు. పాస్‌పోర్ట్ లేకుండా సముద్ర మార్గంలో భారత్‌కు అక్రమంగా చొరబడ్డాడని దర్యాప్తులో తేలిందని, భారత్‌కు వచ్చాక చెన్నైకి చెందిన రాజా (ఏ6)తో కలిసి ఏజెన్సీ నుంచి గంజాయి తరలించే ప్లాన్ వేశారు. ఒడిశా జనబ ప్రాంతానికి చెందిన శ్యామ్ (ఏ7) ద్వారా గంజాయిని సేకరించి, స్విఫ్ట్ డిజైర్ కారు నంబర్ (ఏపీ 39 టీఎఫ్ 2687), పైలెట్ వెహికల్ గ్లామర్ బైక్‌ వ్యవహరిస్తూ తరలిస్తుండగా పట్టుబడ్డారు న్నారు. వారి వద్ద నుంచి కారు, బైక్, నగదు రూ.95,240, 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. జూన్ 16న మధ్యాహ్నం లంకెలపాలెం జంక్షన్‌లో మహిళా ఎస్సై జి.ఎస్.వి.మహాలక్ష్మి నేతృత్వంలోని బృందం వాహన తనిఖీలు చేపట్టి నిందితులను చాకచక్యంగా పెట్టుకుంటున్నారు, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కేసును విజయవంతంగా ఛేదించిన డీఎస్పీ బి.మోహనరావు, సీఐ ఆర్.మల్లికార్జున రావు, మహిళా ఎస్సై మహాలక్ష్మి, ఈగల్ టీం సిబ్బందిని ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలతో సత్కరించారు. పరారీలో ఉన్న ఏ6, ఏ7ల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని హవాలా లావాదేవీలు, డ్రగ్ నెట్‌వర్క్‌పై లోతైన దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో పరవాడ డి.ఎస్.పి మోహన్ రావు, సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐ భీమరాజు, ఈగల్ టీం సిబ్బంది, పరవాడ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి
మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు...
By Pinnehasan Odela 2026-04-09 13:52:32 0 290
Telangana
ప్రతీ తెలంగాణ బిడ్డకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు ✨
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2) పర్వదినాన్ని పురస్కరించుకుని, తెలంగాణ తొలి...
By Ponnala Srinivasrao 2026-06-02 00:27:10 0 129
Bihar
Bihar's Agricultural Growth and Farmer Welfare Initiatives
Bihar continues to strengthen its agricultural sector through various farmer welfare programs...
By Fathima Safa 2026-06-24 12:07:30 0 153
Andhra Pradesh
జై శ్రీరామా నవమి వేడుకలకు high court judge పాల్గొన్నారు
గుంటూరు లోని ఓల్డ్ ఓల్డ్ గుంటూరు మణి హోటల్ దగ్గర నుంచి గోరంట్ల వరకు ర్యాలీ నిర్వహించారు ...
By Kola Kirankumar 2026-03-27 12:02:07 0 552
SURAKSHA
Goa Police Beach Safety Teams Save Tourists from Drowning Daily
 Goa Police Beach Safety Teams patrol Calangute, Baga and Miramar beaches to prevent...
By Kalaga Sailaja 2026-07-03 06:19:54 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com