తేది :16.6.2026 కొత్తూరు గ్రామం వెలుగొండ ప్రాజెక్ట్ ====

0
117

తేది :16.6.2026. కొత్తూరు గ్రామం.వెలుగొండ ప్రాజెక్ట్ =======

 ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆగస్టు చివరి నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి తీరతాం- మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు.

 ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ ను మరియు ఫీడర్ కెనాల్ ను రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం విజయ సునీత గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ పులి శ్రీనివాసులు గారు మరియు ఎర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్సన్ బాబు గారితో కలసి ప్రాజెక్ట్ ను సందర్శించి పనుల పురోగతిపై అధికారులు అడిగి తెలుసుకున్నారు.

• మరోమారు టన్నెల్స్ లోకి వెళ్ళి లైనింగ్, టిబిఎం తొలగింపు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు గారు మరియు ఇతరులు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

• వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ పనులు పూర్తి చేశాం.

• కొల్లంవాగు నుండి 1 టిఎంసి నీరు టన్నెల్స్ లోకి చేరేలా 1.80లక్షల క్యూబిక్ మీటర్ల కు గానూ, ఇప్పటికి 58 వేల క్యూబిక్ మీటర్ల మక్ తొలగించాం.

• టన్నెల్-1 లో అడ్డుగా ఉన్న 1.2 లక్షల క్యూబిక్ మీటర్ల మక్ తొలగింపు పనులలో ఇప్పటికి 40 వేల క్యూబిక్ మీటర్లు తొలగించాం.

• 20 నెలలో టన్నెల్-2లో 7 కి.మీ లైనింగ్ కి గానూ, 5.5 కి.మీ లైనింగ్ పనులు పూర్తి చేశాం.

• మిగిలిన 1.5 కి.మీ లైనింగ్, జూలై చివరి నాటికి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి.

• 5 ఏళ్ళ వైసిపి పాలనలో హైకోర్టు ఆదేశాలతో టన్నెల్-2 లో చిక్కుకుపోయిన టిబిఎం మెషిన్ వెలికితీత పనులు జరుగుతున్నాయి.

• టన్నెల్ బోరింగ్ మెషిన్ 7 కంపార్ట్మెంట్ లలో ఇప్పటికి 3 కంపార్ట్ మెంట్లు బయటకు తీసుకొచ్చాం.

• టిబిఎం లో క్లిష్టమైన హెడ్ ను టన్నెల్ లోనే పూడ్చిపెట్టడానికి అవకాశాలు పరిశీలిస్తున్నాం.

• ఫీడర్ కెనాల్ లో 5.3 కి.మీ రిటైనింగ్ వాల్ పనులు, జనవరిలో ప్రారంభించి నేటికి 5 నెలల్లో పూర్తి చేశాం.

• నత్తనడకన సాగుతున్న 21 కి.మీ లైనింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు గారు .

• మెంధా తుఫాన్ కు ఫీడర్ కెనాల్ లో పడిన భారీ గండికి సిసి వాల్ నిర్మించి పూర్తి చేస్తున్నాం.

• తీగలేరు, ఈస్టర్న్ మెయిన్ కెనాల్స్ తో పాటు పర్మనెంట్ డైవర్షన్ రోడ్డు పనులు సైతం జూన్ నెలాఖరు నాటికి పూర్తికానున్నాయి.

• చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం, సీజన్ మొదలయ్యే నాటికి నల్లమలసాగర్ రిజర్వాయర్ నింపేలా పనులు జరుగుతున్నాయి.

• ఈనెలలో సిఎం గారి చేతుల మీదుగా నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారం అందిస్తాం.

• నల్లమలసాగర్ రిజర్వాయర్ లో నీళ్ళు నింపడానికి నిర్వాసితుల పునరావాసానికి అదనపు బడ్జెట్ లో 905 కోట్లు కేటాయించాం.

 ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ మహిళలకు రాష్ట్ర RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం - ఈ పథకం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుండి అమల్లోకి రానుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ముఖ్యమైన నిర్ణయం...
By Bharat Aawaz 2025-08-11 12:30:44 0 994
Telangana
TGSRTC లో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత
తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం...
By Sidhu Maroju 2025-06-15 17:46:18 0 2K
Telangana
నకిలీ ఐ.డి గుర్తింపు కార్డులతో అనుమతి లేని ఆర్మీ ప్రాంతం లోకి నలుగురు వ్యక్తుల చొరబాటు. అదుపులోకి తీసుకున్న తిరుమలగిరి పోలీస్ లు.
సికింద్రాబాద్.. తిరుమలగిరిలో ఆర్మీ అధీనంలో ఉన్న ప్రాంతంలోకి అక్రమంగా చొరబడిన నలుగురు వ్యక్తులను...
By Sidhu Maroju 2025-06-20 10:14:18 0 1K
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని వినాయక ఉత్సవాలు సోమప్ప సర్కిల్లో
ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో వినాయకుల నిమజ్జనానికి బయలుదేరేటప్పుడు భారీ బాణసంచాలతో...
By Boya Dasthagiri 2026-09-17 00:51:20 0 71
Andhra Pradesh
సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
ఈవీఎం భద్రతా గిడ్డంగి వద్ద ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి...
By Boiena Rajesh 2026-03-26 14:26:18 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com