"ఆగస్టు 2న ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. తలసానికి ఆహ్వాన పత్రం అందజేత. "|

0
219

సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఈ ఏడాది ఆగస్టు 2న నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. 

మంగళవారం ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు, మాజీ మంత్రి మరియు సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఉత్సవాల వివరాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు సంబంధించిన షెడ్యూల్‌ను వివరించిన లేఖను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అందజేశారు. 

జులై 19న ఘటాల ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఆగస్టు 2న అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారని తెలిపారు. 

ఆగస్టు 3న సంప్రదాయబద్ధంగా రంగం (భవిష్యవాణి) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి వెల్లడించారు.

ఈ సమావేశంలో రాంగోపాల్‌పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, రామ్ మోహన్ యాదవ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
వంశపారంపర్య స్థలాన్ని కబ్జా చేశారంటూ బాధితుల ఆవేదన.
మదనపల్లె పట్టణంలోని పాతకచేరి వీధి-2కు చెందిన డి. శ్రీనివాసులు, ఆనంద్ కుమార్ తమ తాత స్వాతంత్ర్య...
By Pagadala Venkateswar 2026-06-11 05:26:24 0 97
Andhra Pradesh
Nara Lokesh: రేపు నారా లోకేశ్ పుట్టినరోజు... సీడీపీ విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ.
జనవరి 23న మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన బర్త్ డే సీడీపీని పంచుకున్న టీడీపీ...
By Pagadala Venkateswar 2026-01-22 14:34:59 0 340
Telangana
36 వ మున్సిపల్ డివిజన్లోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం లో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ లో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు...
By Avunoori Mahesh 2026-04-26 12:45:49 0 193
Andhra Pradesh
DSP గారిని కలిసిన రాజీవ్ రెడ్డి
    ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో నిర్వహించబడుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీ...
By Boya Dasthagiri 2026-03-26 09:54:06 0 344
SURAKSHA
Strengthening Bihar Force: Expanding Police Coverage
The Bihar government is aggressively driving a comprehensive capacity-building initiative to...
By Lokeshwari Panthadi 2026-07-04 10:17:22 0 252
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com