"రామ్‌నగర్ వాసులకు ఊరటనిచ్చిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
183

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలోని రామ్‌నగర్ ప్రాంతంలో బోర్‌వెల్ పనిచేయక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. 

స్థానిక నివాసితుల ఫిర్యాదు అందుకున్న వెంటనే ఆమె స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి, స్వచ్ఛంద సహకారంతో బోర్‌వెల్‌ను మరమ్మతు చేయించి తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చారు. 

దీంతో కాలనీవాసులకు తాగునీటి సరఫరా పునరుద్ధరించబడింది.

ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రాంతంలో నెలకొన్న పలు మౌలిక వసతుల సమస్యలు, పౌర అవసరాలకు సంబంధించిన అంశాలను నివాసితులు ఆమె దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బోర్‌వెల్ మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయించి తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు స్థానికులు శాంతి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె ఎప్పటికప్పుడు ముందుండి స్పందిస్తూ, కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రేమ్, అరుణ్, లింగారెడ్డి, మహేందర్, జార్జ్ తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : మాజీ MLA పుట్ట మధుకు 900 కోట్ల అక్రమాస్తులు...!
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గత  బీ ఆర్ఎస్ హయాంలో 900 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారని...
By Sunka Santhosh 2026-06-22 10:25:37 0 324
SURAKSHA
Bangalore Police Provide Rain Relief To Vendors
 During heavy rains today, Bangalore Police distributed tarpaulin sheets and hot tea to...
By Kalaga Sailaja 2026-07-06 06:59:08 0 175
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం కంభంవారిపల్లి పంచాయతీలో నిర్మించిన కొత్తచెరువు ప్రాజెక్టుతో...
By Kothuru Murali 2026-03-22 06:38:41 0 196
Andhra Pradesh
సర్,రెవెన్యూ అంశాలపై జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ లతో
సర్,రెవెన్యూ అంశాలపై జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ లతో మార్కాపురం కలెక్టరేట్ లో జరుగుతున్న...
By Chennaiah Kati 2026-07-17 07:24:13 0 135
SURAKSHA
Om Prakash Gupta: Steering Maharashtra's Financial Future
A distinguished 1992-batch IAS officer of the Maharashtra cadre, Om Prakash Gupta has played a...
By Lokeshwari Panthadi 2026-07-29 11:58:15 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com