అంగన్‌వాడీ కేంద్రాలు, త్రాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష

0
266

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్, జూన్ 11: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణతో పాటు గ్రామాల్లో తాగునీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కే హరిత ఐఏఎస్ గారు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ నుండి వివిధ శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ (VC) ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా రోజువారీగా తాగునీరు అందేలా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే, భూగర్భ జలాల పెంపునకు దోహదపడే ఇంకుడు గుంతల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో గుర్తించిన వివిధ అభివృద్ధి పనులను ఎక్కడా నాణ్యత లోపించకుండా, అత్యంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Legal
What Did the Chhattisgarh High Court Say About Virginity Tests for Women? Here's Why the Verdict Matters
What Did the Chhattisgarh High Court Say About Virginity Tests for Women? Here's Why the Verdict...
By BMA ADMIN 2025-05-21 12:28:35 0 2K
Telangana
"తప్పు చేస్తే తప్పించుకోలేరు: మల్కాజ్‌గిరి స్పెషల్ డ్రైవ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్లు పెట్టుకుని రోడ్లపై కేరాఫ్...
By Sidhu Maroju 2026-04-21 16:52:23 0 330
Andhra Pradesh
రోడ్లు వేసేది ఎప్పుడు మా బ్రతుకులు బాగుపడేది ఎప్పుడు...? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె. అన్నవరం గ్రామం నుండి గొంటూవానిపాలెం...
By BABJI DADALA 2026-01-23 12:06:37 0 671
SURAKSHA
Sanjay Kumar, IAS: Driving Goa's Vision with Excellence
The Journey Begins A Leader Shaping the Future of Goa Effective governance is built on the...
By Fathima Safa 2026-08-01 05:36:06 0 157
Andhra Pradesh
బీటి రోడ్డు పనులను పరిశీలించిన MLA నదుకుదిటి ఈశ్వరావు
రణస్థలం ఎమ్మార్వో ఆఫీస్ నుండి వేణుగోపాలపురం వరకు బీటీ తారు రోడ్డు పనులు ఈ రోజు ప్రారంభం...
By Mukku Ramu 2026-03-13 11:11:03 0 485
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com