రోడ్డు నియమాలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలి జిల్లా ఎస్పీ నితికా పంత్

0
242

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్ : రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోవద్దని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐ.పి.ఎస్  గారు పిలుపునిచ్చారు. అరైవ్ అలైవ్ (Arrive Alive) ప్రచారంలో భాగంగా బుధవారం ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది రోడ్డు ప్రమాదాల్లో యువత ఎక్కువగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ముఖ్యంగా ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్‌లో మొబైల్ వాడటం మరియు రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. అనంతరం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల దృశ్యాలను స్క్రీన్‌పై ప్రదర్శించి అవగాహన కల్పించగా, కార్యక్రమం ముగింపులో విద్యార్థులు, అధికారులు అంతా కలిసి రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Search
Categories
Read More
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:44 0 83
Andhra Pradesh
సింగపూర్ లో చంద్రబాబుకు టాప్ ప్రోటోకాల్... వీడియో ఇదిగో!
  సింగపూర్ లో చంద్రబాబుకు టాప్ ప్రోటోకాల్... వీడియో ఇదిగో!   Andhra Chandrababu...
By Pagadala Venkateswar 2026-06-16 04:35:27 0 75
Bihar
Bihar Monsoon Update: Active Rains Fuel Agriculture
The southwest monsoon is making significant strides across Bihar, bringing much-needed relief and...
By Lokeshwari Panthadi 2026-07-02 04:07:04 0 218
Andhra Pradesh
మదనపల్లి పట్టణాభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: చైర్‌పర్సన్.
గురువారం మదనపల్లెలోని పికెయంయుడిఎ కార్యాలయంలో పట్టణాభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం జరిగింది....
By Pagadala Venkateswar 2026-05-08 05:21:52 0 130
Telangana
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి,లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో.…మంత్రి కొండాసురేఖ
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి  ‎లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి...
By Ponnala Srinivasrao 2026-07-10 01:52:26 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com