భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు.

0
108

 

భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

 

Andhra

AP High Court key ruling on building construction permits

భవన నిర్మాణ అనుమతులు నిరాకరించే అధికారం పంచాయతీలకు లేదన్న హైకోర్టు

భూమి యాజమాన్య వివాదాలను సివిల్ కోర్టులే తేల్చాలని వెల్లడి

కేవలం లీగల్ నోటీసు ఆధారంగా అనుమతి నిరాకరించడం చట్టవిరుద్ధమని వ్యాఖ్య

నంద్యాల జిల్లా వాసి పిటిషన్‌పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు

15 రోజుల్లోగా దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశం

భూమి యాజమాన్య హక్కులకు (టైటిల్) సంబంధించిన వివాదాలు ఉన్నాయనే కారణంతో గ్రామ పంచాయతీలు భవన నిర్మాణ అనుమతులను నిరాకరించడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి వివాదాలను పరిష్కరించే అధికారం కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డి కీలక తీర్పు వెలువరించారు.

 

నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురానికి చెందిన కె. జమాల్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ టైటిల్‌ను ప్రశ్నిస్తూ మూడో పక్షం ఇచ్చిన లీగల్ నోటీసును ప్రాతిపదికగా తీసుకుని, భవన నిర్మాణ అనుమతిని నిరాకరిస్తూ 2023 డిసెంబర్ 24న గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాన్ని న్యాయస్థానం రద్దు చేసింది.

 

కేసు వివరాల్లోకి వెళితే.. జమాల్ రెడ్డి 2009లో సర్వే నంబర్ 408లో 4 సెంట్ల (195.5 చదరపు గజాలు) స్థలాన్ని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆయన ఇంటి పన్ను చెల్లిస్తూ అక్కడే నివసిస్తున్నారు. తన పాత కట్టడాన్ని తొలగించి కొత్త భవనం నిర్మించుకోవడానికి అనుమతి కోరగా, పంచాయతీ కార్యదర్శి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనికి స్పందించిన పిటిషనర్, భవన నిర్మాణానికి అవసరమైన ప్లాన్, చలాన్ పత్రాలను సమర్పించారు.

 

2009 నాటి సేల్ డీడ్ చెల్లదంటూ విక్రయదారుల సోదరుడి వారసులు 2023 డిసెంబర్‌లో లీగల్ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసును సాకుగా చూపి పంచాయతీ అధికారులు నిర్మాణ అనుమతి దరఖాస్తును తిరస్కరించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. దాదాపు 16 ఏళ్లుగా సదరు వివాదంపై సివిల్ కోర్టును ఆశ్రయించని వారి నోటీసు ఆధారంగా అనుమతిని నిరాకరించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. దరఖాస్తుదారుడి పేరు మీద టైటిల్ ఉందా లేదా, భూమి ఆయన స్వాధీనంలో ఉందా అనే అంశాలను మాత్రమే పంచాయతీలు పరిశీలించాలని సూచించింది. ఈ నేపథ్యంలో, 15 రోజుల్లోగా జమాల్ రెడ్డి దరఖాస్తుపై తగిన నిర్ణయం తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.                                

Search
Categories
Read More
SURAKSHA
WB Ex-Police: Heroes Without Uniform But With Heart
Yesterday retired WB police officers continue as heroes without uniform. Orphan children got...
By Kalaga Sailaja 2026-07-03 13:26:10 0 95
Rangareddy
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..!సజ్జనార్
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..! ‎జాగ్రత్త అని హైదరాబాద్ నగర పోలీసు...
By Ponnala Srinivasrao 2026-08-09 01:19:06 0 143
Ladakh
Renewable Energy and Solar Power Growth in Ladakh
Ladakh is emerging as a key center for renewable energy development in India, with a strong focus...
By Fathima Safa 2026-06-24 09:45:19 0 153
SURAKSHA
Karnataka Police Today: Heroes Without Badge Heart
Today Karnataka police officers proved heroes need no badge. Orphan children got guardians who...
By Kalaga Sailaja 2026-07-04 07:25:25 0 109
Telangana
బీజేపీలో చేరనున్న తెలంగాణ లోని కీలక నేత కుటుంబం.!
ఇటీవల ఢిల్లీ పెద్దలతో ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్ల పై ఆ కీలక నేతతో కుదిరిన బేరం.. మల్కాజిగిరి...
By Ponnala Srinivasrao 2026-05-06 05:11:10 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com