చింతూరు లో విషాదం హెచ్ సి ఎల్ ఉద్యోగి మృతి!

0
70

పోలవరం జిల్లా చింతూరు మండలం తులసిపాక గ్రామ సమీపంలో ఉన్న సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద గల ప్రకృతి అందాలను చూడటానికి హైదరాబాద్ నుంచి ఆరుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వచ్చారు. వ్యూ పాయింట్ వద్ద గల సోకిలేరు వాగులో ముగ్గురు అమ్మాయిలు,ముగ్గురు అబ్బాయిలు స్నానానికి దిగారు. ఈ సమయంలో వాగు ఉదృతంగా ప్రవహించడంతో ఆరుగురు వాగులో కొట్టుకుపోసాగారు.రవి హేమంత్,కోమల ఐశ్వర్య లు సమీపంలోని వాగులోని పెద్ద బండరాయిని పట్టుకొని గట్టెక్కారు.మహమ్మద్ ఇమ్రాన్,కోమల ధరణి, గీల సింధుజా వాగులో కొట్టుకుపోతూ వాగు మధ్యలో ఓ బండరాయిని పట్టుకొని ఆగిపోయారు.కొంత సమయం తర్వాత సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీస్ సిబ్బంది వాగు వద్దకు చేరుకొని వాగు మధ్యలో బండరాయిని పట్టుకొని ఉన్న ముగ్గురుని వాగు బయటకి తీసుకురావడం జరిగింది.ఇది ఇలా ఉండగా కోసూరు నీలేష్ కుమార్ (25) వాగులో గల్లంతయ్యాడు. నీలేష్ కుమార్ ఆచూకీ కోసం చింతూరు సీఐ గోపాలకృష్ణ, మోతుగూడెం ఎస్సై హుస్సేన్ లు పోల్లూరు గ్రామం నుండి గజ ఈతగాలను తెప్పించి వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. వాగులో లోతైన ప్రదేశం వద్ద నీలేష్ కుమార్ మృతదేహం లభ్యం అయ్యింది. తమతో పాటు వచ్చిన స్నేహితుడు మృత్యువాత పడటంతో ఆ స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

#Yadagiri 

Search
Categories
Read More
Assam
Meghalaya Revives Talks on Assam Border Disputes
The Meghalaya government has officially reconstituted three regional committees to accelerate the...
By Lokeshwari Panthadi 2026-07-01 10:52:40 0 141
Andhra Pradesh
చీరాల గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఏడాది పూర్తి త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు – పేదలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు.
చీరాల: చీరాల పట్టణంలో గత పదేళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ...
By Gadiyapudi Narendra 2026-02-10 03:32:20 0 232
Andhra Pradesh
డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన.
మదనపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఈశ్వరమ్మ కాలనీ, బేకరీ కాలనీలలో గత మూడేళ్లుగా డ్రైనేజీ...
By Pagadala Venkateswar 2026-05-19 05:05:50 0 102
Andhra Pradesh
చిన్నగంజాంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు :పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
మహిళల అభివృద్ధి సాధికారతతోనే సమాజం పురోగమిస్తుందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు....
By Vadlamudi NagaVenkat 2026-03-08 10:55:59 0 948
SURAKSHA
AP పోలీసులు నేడు: కొత్త పోలీసులకు మార్గదర్శకులుగా
నేడు సీనియర్, రిటైర్డ్ AP పోలీసులు కొత్త కానిస్టేబుళ్లకు మార్గదర్శనం చేశారు. ట్రైనింగ్ సెంటర్లలో...
By Kalaga Sailaja 2026-07-04 09:30:40 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com