టాలీవుడ్ ఇండస్ట్రీ బాటలో... ఫోక్ ఇండస్ట్రీ ?

0
165

ఫోక్ ఇండస్ట్రీ బతకాలంటే నిర్మాత బతకాలి.. 

‎ ఫోక్ ఇండస్ట్రీ బతకాలంటే నిజమైన కళాకారులు బతకాలి.. 

‎ ఫోక్ ఇండస్ట్రీ బతకాలంటే రచయితలు, గాయకులు, సంగీత దర్శకులు, నృత్య దర్శకులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ( DOP, ఎడిటింగ్, DI, పోస్టర్ డిజైనర్స్), నటి, నటుల ఆలోచన విధానం మారాలి.. పాటకు మించి ఖర్చు పెట్టించే పద్ధతి మార్చుకోవాలి.. 

‎ మనకి ఇచ్చే డబ్బులకంటే ప్రొడక్షన్ ఖర్చును విపరీతంగా పెంచి నిర్మాత నడ్డి విరిచే విధానంలో మార్పు రావాలి.. ఈరోజు అందిన కాడికి దోచుకుంటే రేపటికి నిర్మాత దొరకక రేపటి కళాకారునికి పని దొరకదు.. నిరుద్యోగం ఒకవైపు తాండవిస్తుంటే... యూట్యూబ్ జానపద పాటలపై ఆధారపడి బతుకుతున్న కళాకారుల పొట్టగొట్టిన వాళ్ళం అవుతాం.... 

‎ నిర్మతల ఆలోచన విధానాల్లో కూడా మార్పు జరగాలి.. 

‎ ఇండస్ట్రీలో రెండు కళ్ళు, నాలుగు కళ్ళు అనే సిద్ధాంతాన్ని వదిలి 

‎ అందరితో పని చేయడం నేర్చుకోండి.. 

‎ మీరు ఎంచుకున్న పాటలో దమ్ముంటే ఎవరు నటించినా, ఎవరు తీసిన, ఎవరు చేసిన, ఆ పాట మిలియన్ వ్యూస్ దాటిపోయిన సాక్ష్యాలు అనేకం.. 

‎ పాటలను ఒక దళారి కాంట్రాక్టు మాట్లాడుకుని మొత్తం వాళ్లే చేసి మీ చేతికి ఇస్తే, ప్రొడ్యూసర్ గా మీరు ఏం చేస్తున్నట్టు.. 

‎ప్రొడక్షన్ ను కంట్రోల్లో పెట్టుకునే బాధ్యత ప్రొడ్యూసర్ గా మీకు, మీతో పాటు అన్ని విభాగాలకు బాధ్యత కలిగి ఉండాలి...

‎ ఒక పాటను ఒక రోజులో కాదని 3రోజులు.. కొంత మంది పది రోజులు షూట్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి... మీరు జానపదాన్ని తీస్తున్నారా సినిమాను తీస్తున్నారా... 

‎ జానపదాన్ని సినిమా మార్కెట్తో పోల్చుకుంటే ప్రొడ్యూసర్ గోతిలో పడక తప్పదు.. కోట్లు తెచ్చిన ఒకటో రెండో పాటలను చూసి వేలాది పాటలు అదే బడ్జెట్ తో తీయడం వల్ల నిర్మాత నడ్డి విరిగిపోతుంది.. 

‎ దయచేసి మీరు ఇచ్చే రెమినేషన్ మీరు ఫిక్స్ చేయండి.. 

‎ అవతలి వాళ్లకు ఆ అవకాశాన్ని ఇవ్వకండి... 🙏

‎ అతి తక్కువలో పనిచేసే వారు అధిక సంఖ్యలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లు చాలామంది ఉన్నారు... 

‎ మీరేం భయపడవలసిన అవసరం లేదు.. 

‎ కొంతమంది ప్రొడ్యూసర్లు ఆచితూచి అడుగు వేయడం వల్ల నష్టాల్లో లేరు... అలాగని లాభాల్లో కూడా లేరు... 

‎ సీడీల కాలంలో ఒక తప్పిదం జరిగింది దానివల్ల చాలామంది కళాకారులు ప్రొడ్యూసర్లు కనిపించనంత కాలగర్భంలో మునిగిపోయారు... 

‎ లాయి లాయి లబ్బరు బొమ్మ మొదలుపెట్టి హిట్టు కొట్టిన తర్వాత 

‎ స్థానిక కళాకారులను కాదని సినిమా వాళ్ళ వెంటపడి ఖర్చుల పాలై చేతులు కార్చుకున్న నిర్మాతలు చాలామంది ఉన్నారు... 

‎ ఇప్పుడు అదే పునరావృతం అవుతుంది.. తెలంగాణ జానపదానికి అర్థం తెలియని సాంప్రదాయాలు తెలువని కళాకారులను తీసుకొచ్చి స్థానికంగా ఎంతో కలదాగి ఉన్న కళాకారులను వెనుకకు నెట్టేస్తున్నాం...

‎ ఇక్కడున్న వాళ్లకి ఐదు వేల నుండి పదివేల లోపే రెమినేషన్ ఇచ్చిన మనం 

‎ మన జానపద శైలి ఏ మాత్రం తెలవని వాళ్లకు మాత్రం 40 వేలు, 50 వేలు, 70000, లక్ష రూపాయల వరకు చెల్లించుకుని సంబరపడుతున్నాం...

‎ తప్పు ఎక్కడ జరుగుతుందో వెతుకుదాం.. దాన్ని సరి చేసుకొని బడ్జెట్ లో తగ్గించుకుందాం.. నిజమైన తెలంగాణ కళాకారులను, సాంకేతిక నిపుణులను, నిర్మాతలను కాపాడుకుందాం...

Search
Categories
Read More
Andhra Pradesh
రజక మహిళపై ఓ కత్తితో దాడి చేతి వేళ్ళకు గాయాలు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించిన బాధిత కుటుంబ సభ్యులు రజకులు
చెరుకుపల్లి: నడింపల్లి గ్రామంలో చందోలు సామ్రాజ్యం అని రజక మహిళపై నిర్దాక్షిణ్యంగా కత్తితో దాడి...
By Gadiyapudi Narendra 2026-02-18 16:43:44 0 255
Haryana
Haryana Strengthens Agriculture and Farmer Welfare
Haryana continues to prioritize agriculture and farmer welfare through initiatives aimed at...
By Fathima Safa 2026-07-06 08:51:23 0 240
Andhra Pradesh
కదిరి పట్టణంలో ఈరోజు శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది
ఈరోజు ఉదయం కదిరి పట్టణంలోని శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమై...
By Benguluri Madhubabu 2026-03-10 13:55:33 0 226
Andhra Pradesh
ఐదు జిల్లాల కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
For scrolls   అమరావతి   *5 వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-17 09:31:55 0 254
Health & Fitness
Breakthrough Designation for Liver Disease Therapy
The landscape of metabolic health shifted significantly as the US FDA granted Breakthrough...
By Dunna Jessicaruth 2026-05-19 07:06:45 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com