పటేల్ నుంచి పవన్ దాకా తెలంగాణపై అవే కుట్రలు.!!

0
161

నాటి హైదరాబాద్ స్టేట్‌ నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం వరకూ జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రాంతం ఒక రాజకీయ ప్రయోగశాల మారింది. కాంగ్రెస్‌ నుంచి బీజేపీ వరకూ జాతీయ పార్టీలన్నీ తెలంగాణను ప్రయోగాల కేంద్రంగా మార్చుతున్నాయి. తెలుగుగోడి అస్తిత్వంతో పుట్టిన టీడీపీ, ఉత్తరాది అహంకారం, దక్షిణాదిపై వివక్షంటూ ఏర్పాటైన జనసేన పార్టీ కూడా ఇప్పుడు తెలంగాణను రాజకీయ క్షేత్రంగా మార్చుతున్నాయి.

‎.నాటి పటేల్‌ సైన్యం నుంచి నేటి పవన్‌ కల్యాణ్ సైనిక్స్‌ వరకూ తెలంగాణపై వారిది ఒకటే ఎజెండా, అజెండా. నాడు తెలంగాణ ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండానే హైదరాబాద్‌ స్టేట్‌పై పటేల్‌ సైన్యం దురాక్రమణను పాల్పడింది.నేడు ఎన్నో పోరాటాలు త్యాగాలు, ఆత్మ బలిదానాల పునాదుల మీద పురుడు పోసుకున్న నాటి హైదరాబాద్‌ స్టేటే రూపాంతరం చెంది నేటి తెలంగాణ స్టేట్‌ గా ఏర్పడింది. 

‎.త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణపై అచ్చం నాడు పటేల్‌ సైన్యం దురాక్రమణానికి పాల్పడినట్లే నేడు పవన్‌ సైనిక్స్‌ తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నారు. నాడు కమ్యూనిస్టుల త్యాగాలను పటేల్ సైన్యం కాంగ్రెస్‌ ప్రభుత్వం గౌరవించలేదు.నేడు పవన్‌ పిల్ల సైనిక్స్‌ తెలంగాణ అమరుల త్యాగాలను గౌరవించడం లేదు.

‎.తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం రోజు హైద్రాబాద్‌లో జనసైన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం, ఎన్టీయే కూటమిలో కీలక భాగస్వామైన పవన్‌ కల్యాణ్‌ నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ చేసిన కామెంట్స్‌ను లోతుగా పరిశీలిస్తే తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన సారంశం అతని మాట్లాల్లో దాగి ఉంది.

‎.పవన్‌లో జూన్‌ 2న హైద్రాబాద్‌లో సభ పెట్టాలనుకోవడం. అంతకు ముందు ప్రొ.నాగేశ్వర్‌ చేసిన విశ్లేషణను అవకాశంగా మార్చుని జనసేన పార్టీ ఏపీ నేతలు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ చిచ్చు రాజేసే విధంగా వ్యహరించారు.నాగేశ్వర్‌పై కేసు పెట్టడం కేవలం బటయకు కనిపించేది మాత్రమే దాని వెనుక తెలంగాణ అస్తిత్వం దాడి చేసే ఎజెండాతో జనసైనిక్స్‌ రెచ్చిపోయారు. తెలంగాణలో కుట్ర రాజకీయాలకు ప్రొఫెసర్‌ ఇష్యూను కారణంగా చూపిస్తూ జూన్‌ 2న తెలంగాణలో అలజడికి కుట్రలు చేశారు. ఉద్యమకారులపై, వారి కుటుంబాలను కించపర్చేలా జనసైనిక్స్‌ మాట్లాడారు.తెలంగాణ కోసం అమరులైన వారిని, తెలంగాణ వాదులను అవమానించారు.  

‎.దీంతో తెలంగాణ సమాజం భగ్గున మండింది.తెలంగాణ వాదులకు,ఉద్యమకారులకు వారి కుటుంబాల పక్షాన నిలబడ్డారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పిల్ల సైనిక్స్‌ తోక మూడవాల్సి వచ్చింది.రెండు రాష్ట్రాల మధ్య జనసేన నేతలు సృస్టించిన ప్రాంతీయ వైరాన్ని తగ్గించాల్సిన పవన్ కల్యాన్‌ హైద్రాబాద్‌ వచ్చి అగ్గికి మరింత ఆజ్యం పోశారు.దీంతో తెలంగాణపై ఒక పథకం ప్రకారం పద్దతిగా జనసేనను ముందు కొన్ని రహస్య శక్తులు హిడెన్‌ ఎజెండాతో చేస్తున్నాయని తెలంగాణ సమాజానికి అర్థమైంది.

‎.నాడు పటేల్ సైన్యంలాగే నేడు పవన్ సేనాని తెలంగాణపై దాడికి సిద్దమైనట్లు తెలంగాణ ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక్కడ పటేల్‌ సైన్యంతో పవన్‌ సేనాని ఏం పోలిక అనే డౌట్స్‌ సహజంగానే రావచ్చు. పటేల్‌ సైన్యం హైదరాబాద్‌ స్టేట్‌ను నిజాం నుంచి విముక్తి చేసి అఖండ భారత్‌లో భాగం చేశారు కదా మంచిదే కథ అన్న అభిప్రాయాలు వస్తాయి. అయితే పటేల్ సైన్యం చేసింది విలీనమని, విమోచనమని రకరకాల పార్టీలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు..కానీ పటేల్ సైన్యం హైదరాబాద్‌ స్టేట్‌ను దురాక్రమం చేసిందన్నది చరిత్ర చెప్పిన వాస్తవం. రజాకార్ల పేరుతో వేల మంది కమ్యూనిస్టులను పటేల్‌ సైన్యం హత్య చేసింది.

‎.అయితే పటేల్‌ సైన్యం చేసిన దురాక్రమనపై తెలంగాణ ప్రజల్లోనే దేశ ప్రజల్లో కూడా భిన్నవాదలున్నాయి..అది పక్కనబెట్టితే పటేల్‌ సైన్యం హైదరాబాద్‌ స్టేట్‌ దురాక్రమణకు చెప్పిన కారణాలు నేడు జూన్‌ 2న హైదరాబాద్‌లో చెప్పిన అంశాలు దగ్గరి సంబంధం ఉంది.

‎.నాటు సర్దార్‌ వల్లాభయ్‌ పటేల్‌ హైదరాబాద్‌ స్టేట్‌ను దురాక్రమణ చేసేందుకు చెప్పిన కారణాల్లో హైదరాబాద్ స్టేట్‌లో కమ్యూనిజం పెరుగుతుందన్నది ప్రధాన కారణం.కమ్యూనిస్టులు హైదరాబాద్‌ నుంచి రష్యా వరకూ రెడ్ కారిడార్‌ నిర్మిస్తున్నారని ఇది భారత దేశానికి ముప్పుగా మారుతుందని పటేల్‌ దురాక్రమణకు అసలు కారణం.

‎.అందుకే హైద్రాబాద్‌ పై పోలీస్‌ చర్యకు దిగిన తీరు కూడా కేవలం కమ్యూనిస్టులను నిర్మూలించడానికే అన్నది రజాకార్ల ముసుగులో వేల మంది కమ్యూనిస్టులను హత్య చేసింది. నిజంగా హైద్రాబాద్‌ స్టేట్ ప్రజలకు నిజాం నుంచి విముక్తి చేయాలన్న ఉద్దేశ్యమే ఉంటే లొంగిపోయిన నిజాంను రాజ్‌ ప్రముఖ్‌ గా ఎందుకు నియమిస్తుంది.అంటే విషయం స్పష్టం హైద్రాబాద్‌ స్టేట్‌లో కమ్యూనిస్టులను నిర్మూలించడం, కమ్యూనిస్టు పోరాటాలు లేకుండా చేయడమే నాటి పటేల్‌ లక్ష్యం.

‎.సరే పటేల్‌ చరిత్ర పక్కన బెట్టి ఇప్పుడు మళ్లీ పవన్‌ దగ్గరకు వద్దాం. పటేల్‌ నుంచి పవన్‌ దాకా నాటి హైదరాబాద్‌ స్టేట్‌ నేటి తెలంగాణ స్టేట్‌ అని ఎందుకు పోల్చాల్సి వచ్చిందో చూద్దాం.

‎.పటేల్ కాంగ్రెస్ పార్టీ లీడర్‌ అయిన బీజేపీ ఇప్పుడు ఓన్‌ చేసుకుటుంది. బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించి పటేల్‌ బ్యాన్‌ చేశారు..అయిన ఇప్పుడు బీజేపీ ఎందుకు పటేల్‌ను ఓన్‌ చేసుకుంటుందంటే పటేల్‌ భౌతికంగా కాంగ్రెస్‌లో ఉన్న ఆలోచనలు మాత్రం సంఘ్‌ ఆలోచనలే..అందుకు పటేల్‌ను కాంగ్రెస్‌ కంటే బీజేపీ తమ వాడిగా చెప్పుకుంటుంది..

‎.దేశంలో అనేక సంస్థనాలను భారత్‌లో విలీనం చేసి అఖండ భారత్‌ను నిర్మించారన్న ఒకే ఒక్క కారణంగా పటేల్‌ను బీజేపీ ఓన్‌ చేసుకుంటుంది.గుజరాత్‌లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో వేల కోట్లు భారీ విగ్రహం బీజేపీ పెట్టింది.

‎.నాడు సర్థర్‌ వల్లాభాయ్‌ పటేల్‌ ఏ కారణాలు చెప్పి హైద్రరాబాద్ స్టేట్‌ను దురాక్రమణ చేశారో.పటేల్‌ను స్పూర్తిగా తీసుకున్న బీజేపీ, ఎన్డీయే కూటమి పక్షాలు, ముఖ్యంగా పవన్‌ కల్యాన్‌ తెలంగాణ రాజకీయాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు నుంచి హైద్రాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న అన్ని కుట్రలు విఫలం కావడంతో ఇప్పుడు కొత్త వ్యూహంతో మళ్లీ వస్తున్నట్లు కనిపిస్తుంది.

‎.జాతీయ భావం, దేశ సమగ్రత అంటూ నాడు పటేల్‌ హైద్రాబాద్‌ స్టేట్‌ను దురాక్రమించారో..నేడు పవన్‌ కూడా అదే జాతీయభావం అనే అందమైన ముసుగులో మళ్లీ తెలంగాణ స్టేట్‌పై రాజకీయ దాడికి జనసేన చీఫ్‌ పాల్పడుతున్నారు.

‎.ఈ నేపథ్యంలోనే జూన్‌ 2న హైదరాబాద్ లో ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన పవన్‌ కల్యాన్‌ నాడు పటేల్‌ ఏ అంశాలైతే హైదరాబాద్ దురాక్రమణకు కారణంగా చెప్పారో..పవన్‌ కూడా అదే అంశాలు ప్రస్తావించారు..తెలుగు ప్రజల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా పవన్ మాట్లాడమే కాకుండా చాలా లోతైన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపే ఆలోచనలు చేస్తున్నట్లు తన మాటల సారంశంలో నిఘూడంగా కనిపించింది.

‎.తెలంగాణపై ప్రేమ అంటూనే తెలంగాణ ఏర్పాటుపై పవన్‌ విషం చిమ్మారు. నాడు పటేల్‌ హైద్రాబాద్‌ను అక్రమించేందుకు, కమ్యూనిస్టులను అణచివేసేందుకు ఏ విధంగా అయితే నిజాం పాకిస్తాన్‌లో కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.కమ్యూనిస్టులు హైద్రాబాద్‌ నుంచి రష్యా వరకూ రెడ్ కారిడార్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని ఏ కారణాలైతే చెప్పారో..ఇవాళా మళ్లీ తెలంగాణను అక్రమించేందుకు సీమాంధ్ర పార్టీలు, పవన్‌ కల్యాన్‌ అవే కారణాలు తెలంగాణ వచ్చి ప్రస్తావిస్తున్నారు.

‎.తెలంగాణను పాకిస్తాన్, పాలస్తినాతో పోల్చారు..ఇది ఏదో అన్న ఫలంగా చేసిన వ్యాఖ్యలు కాదు.దీని వెనుక తెలంగాణలో అలజడులు సృష్టించాలన్న బీజేపీ పవన్‌ బలమైన కారణాలున్నాయనిపిస్తుంది. పదేపదే తెలంగాణ ఏర్పాటును బీజేపీ భారత్ పాక్ విభజనతో పోల్చడం.పవన్ కల్యాన్‌ తెలంగాణ ఏమైనా పాకిస్తానా. పాలస్తినా అంటూ మాట్లాడటాన్ని లోతుగా గమనిస్తే బీజేపీ పవన్‌ ఎజెండా ఏంటో అర్థమైతుంది.అంతేకాదు తెలంగాణను పాలస్తినాతో పోల్చారంటే హైద్రబాద్‌ను గాజాగా మార్చే కుట్రలు జరుగుతున్నట్లు స్పష్టమైతుంది..పవన్‌ పాకిస్థాన్, పాలస్తీనా కామెంట్స్ వెనుక భారీ కుట్రలున్నాయన్నది క్లీయర్‌. అంతేకాదు పాతబస్తీలో తిరంగ జెండా ఎగరవేశాం అంటూ పవన్‌ చేసిన కామెంట్స్‌ను దూర దృష్టితో ఆలోచించాలి. పాతబస్తీ అంటే పాకిస్తాన్‌ అనేది బీజేపీ పవన్‌ ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో మత విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ  

‎.హైదరాబాద్ ను గాజా మార్చే కుట్రలు జరుగుతన్నాయో అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.పవన్ పాక్‌, పాలస్తినా కామెంట్స్‌ వెనుక సీమాంధ్ర ఉత్తరాది బీజేపీ పార్టీ ఇజ్రాయెల్ లా తెలంగాణ పై దాడికి ప్రయత్నం చేస్తున్నాయో అన్న అనుమానాలు తెలంగాణవాదుల్లో వ్యక్తం అవుతుంది.

‎.తెలంగాణ ఏమైనా పాకిస్థానా అనడం, పాతబస్తి అంటే పాకిస్తన్‌ అన్నది కాషాయ పార్టీ విధానం, ఇప్పుడు పవన్‌ అవే కామెంట్స్ చేయడం చూస్తే పవన్‌ వెనుక బీజేపీ వ్యూహం ఉందన్నది స్పష్టమైతుంది.

‎.1947-48లో తెలంగాణ/ హైదరాబాద్ స్టేట్ పై ఇదే తరహాలో పాకిస్థాన్ ముద్రా చేశారు..పటేల్ ను ఆరాధిస్తూ అదే తరహాలో తెలంగాణపై ఇప్పుడు పవన్‌ పాకిస్థాన్ అంటూ ప్రచారం. పటేల్ స్పూర్తితో తెలంగాణను ఏపీలో కలిపే కుట్రలు చేస్తున్నట్లు అనుమానాలు పెరుగుతున్నాయి.

‎.నాడు జాతీయం వాదంతో పేరుతో దురాక్రమణ జరిగినట్లే ఇప్పుడు మళ్లీ సీమాంధ్ర పార్టీలు, పవన్ కల్యాన్‌ తెలంగాణలో అస్తిత్వం ఆత్మగౌరవంపై దాడి చేసేలా, తెలంగాణ వాదం లేదని చెప్పేలా ప్రయత్నం చేస్తున్నారు. అంతిమంగా అదే జాతీయవాదం పేరుతో తెలంగాణ ఆక్రమణకు కుట్రలు జరుగుతున్నాయా అన్న భయం తెలంగాణ సమాజం నుంచి వ్యక్తం అవుతుంది.

‎.ఈ నేపథ్యంలో వాళ్ళ కుట్రలకు అడ్డుగా ఉన్న తెలంగాణ వాదులుపై సీమాంధ్ర పార్టీల పిల్ల సైనిక్స్‌ బెదిరింపులకు దిగుతున్నారు..నాడు తెలంగాణ సమాజం అసమాకత్వం వల్ల పటేల్ సేన కుట్రలను తిప్పికొట్టడంతో విఫలమయ్యింది.కానీ నేడు పవన్ సేన కుట్రలను ఎప్పటికప్పుడు తెలంగాణ నేల తిప్పికొట్టుతుంది.

‎.నాడు రజాకార్ల పేరుతో ఏ విధంగానైతే కమ్యూనిస్టుల పటేల్‌ సైన్యం ఊచకోత కోసిందో. నేడు తెలంగాణవాదులపై పాక్, సంఘవిద్రోహ శక్తులంటూ జెండా కూలీలు దాని అధినేత బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాడు కమ్యూనిస్టుల పోరాటాలను సాయుధులంటూ అణచివేత వేస్తే నేడు తెలంగాణవాదులను వేర్పాటువాదులంటూ అణచివేసే కుట్రలు జరుగుతున్నాయి.

‎.నాడు కమ్యూనిస్టులపై విష ప్రచారం చేసినట్లే నేడు పవన్‌ తెలంగాణవాదులపై విష ప్రచారం చేస్తున్నారు. నాడు కమ్యూనిస్టులను పాక్, చైనా, రష్యా ఎజెంట్ లంటూ ప్రచారం చేసినట్లే ఇవాళా తెలంగాణవాదులను వేర్పాటువాదులు, దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నాడు.

‎.ప్రాంతీయవాదం ఉండాలంటూనే జాతీ సమాఖ్యకు ప్రమాదం అంటూ తెలంగాణలో తెలంగాణ ప్రాంతీయవాదం ఉండొద్దంటున్నారు.ఇవాళా తెలంగాణవాదులను, ప్రాంతీయవాదాన్ని నిర్మూలించకుండా వదిలేస్తే రేపు జాతీయ గీతం పాడరు, వందే మాతరం పాడరంటూ తెలంగాణవాదులను దేశ ద్రోహులుగా చిత్రీకరించే కుట్రలు చేస్తున్నారు. అంతేకాదు కేంద్ర హోం మంత్రి వీరిని వదిలిపెట్టొద్దంటూ సూచిస్తున్నారు.తెలంగాణకు సంబంధం లేని అందులో జూన్‌ 2 రోజు పవన్‌ అసందర్భంగా బెంగాల్ ఫలితాల ప్రస్తావన తీసుకువచ్చారు. బెంగాల్ లో కమ్యూనిస్టుల శకం ముగిసింది తెలంగాణలో ముగుస్తుందని హెచ్చరించారు.

‎.నాడైనా నేడైనా తెలంగాణలో కమ్యూనిస్టులు చాలా బలంగా ఉన్నారు.బలమైన పోరాటాలు చేస్తున్నారు. కమ్యూనిస్టులకు ఇవాళా రాష్ట్రంలో తెలంగాణవాదులు, తెలంగాణ ఉద్యమకారులు తోడయ్యారు..దీంతో తెలంగాణ మత రాజకీయాలకు కుల రాజకీయాలకు అస్కారం లేకుండా పోయింది.తెలంగాణలో అధికారం కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. మత రాజకీయాలు చేసేందు మందీర్‌ మసీద్‌ శివం శవం అంటూ ఎన్నిప్రయత్నాలు చేసిన తెలంగాణ నేల తిప్పికొట్టింది.

‎.అటు తెలంగాణలో ముఖ్యంగా హైద్రాబాద్‌పై క్రమంగా పట్టు కోల్పోతున్న సీమాంధ్ర పార్టీలు మళ్లీ పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి.తెలంగాణవాదులు సమైఖ్యవాదాన్ని తిప్పికోట్టుతున్నారు.దీంతో ముందు రాష్ట్రంలో తెలంగాణవాదం, తెలంగాణవాదులు లేకుండా చేయలని, ప్రజల మధ్య మత చ్చు పెట్టాలని ఎన్డీయే కూటమి పార్టీలు తెలంగాణలో కుట్రలు చేస్తున్నాయి.కమ్యూనిస్టులు, కమ్యూనిజం లేకుండా చేయాలని పవన్‌ సహ ఎన్డీయే పార్టీలు కుట్రలు మొదలు పెట్టాయి.

‎.అందులో భాగంగానే జూన్‌ 2న పవన్‌ కల్యాన్‌ తెలంగాణవాదంపై కమ్యూనిస్టులపై తెలంగాణవాదులను దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తెలంగాణవాదినికి పోటీగా జాతీయవాదాన్ని తీకువచ్చి నాడు పటేల్‌ హైదరాబాద్‌ స్టేట్‌ను దురాక్రమించినట్లు నేడు పనన్‌ సేన తెలంగాణపై దాడి సిద్దమైంది.పటేల్‌ సైన్యం నుంచి పవన్ జెండా కూలీల వరకూ తెలంగాణ ప్రజల అభిప్రాయాలు, అస్తిత్వంపై దాడి చేయమే ఎజెండగా పెట్టుకున్నారు. 

‎.తెలంగాణవాదం దేశానికి ప్రమాదమంటూ ప్రచారం మొదలు పెట్టి, తెలంగాణవాదులు జాతీయ భద్రతకు విఘాతం కల్పిస్తారంటూ నాడు జాతీయవాదం ముసుగులో పటేల్‌ సైన్యం కమ్యూనిస్టులను నిర్మించినట్లే.నేడు పవన్‌ అండ్ ఎన్డీయే కూటమి తెలంగాణవాదులను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న తెలంగాణ ప్రమాదంలో పడుతుంది. ప్రజల అప్రమత్తతే తెలంగాణకు రక్ష. తెలంగాణవాదమే రాష్ట్రానికి రక్షణ కవచం..ఏ మాత్రం తెలంగాణవాదం బలహీనపడిన తెలంగాణ ఉనికికే ప్రమాదం ఏర్పాడుతుంది.

Search
Categories
Read More
Delhi - NCR
Digital Tourism: Ministry of Tourism & Google Ink AI Pact
In a landmark move, the Ministry of Tourism, Government of India, has officially signed a...
By Lokeshwari Panthadi 2026-07-03 06:56:57 0 82
Andhra Pradesh
ఆదోని పట్టణంలోని DSF.PDSO ఆధ్వర్యంలో
ఆదోని నారాయణ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి.రకరకాల పేర్లతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం...
By Boya Dasthagiri 2026-06-22 13:55:54 0 189
Andhra Pradesh
పుంగునూరు పట్టణం: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
శుక్రవారం మధ్యాహ్నం పుంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాళ్యం సమీపంలో మినీ బైపాస్ రోడ్డులో ఒక లారీ...
By Kothuru Murali 2026-03-06 11:52:52 0 184
SURAKSHA
Deepak Rawat, IAS: Bold Leadership in Governance
A distinguished 2007-batch Uttarakhand IAS officer whose transparent governance, decisive...
By Lokeshwari Panthadi 2026-07-18 05:51:43 0 197
Punjab
Punjab's 2026 Education Reforms: Building Better Learning
Punjab's education sector reforms in 2026 focus on enhancing the quality, accessibility, and...
By Fathima Safa 2026-06-16 10:32:46 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com