ఆసిఫాబాద్ దస్నాపూర్ అగ్నిప్రమాద బాధితులకు కాంగ్రెస్ అండ – డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క భరోసా

0
360

🎤భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్ పట్టణ పరిధిలోని దస్నాపూర్ కాలనీలో గత అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద బాధితులను కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క గురువారం నాడు పరామర్శించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆమె, కాలిపోయిన ఇళ్లను మరియు సర్వస్వం కోల్పోయిన కుటుంబాల పరిస్థితిని స్వయంగా పరిశీలించి, బాధితులకు ధైర్యం చెప్పారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటుందని భరోసా ఇస్తూ, ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు ఆమె తన వంతుగా తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా, ఇళ్లు కాలిపోయిన బాధితులందరికీ ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేకంగా మంజూరు చేయిస్తామని గట్టి హామీ ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వ సహాయ సహకారాలు త్వరగా అందేలా ఉన్నతాధికారులతో మాట్లాడుతానని, కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులకు పూర్తి అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ, డీసీసీ ఉపాధ్యక్షుడు తరిఖ్, డైరెక్టర్ మారుతి పటేల్, కౌన్సిలర్ వైరాగడే గోవింద్, మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి, కాంగ్రెస్ నాయకులు ఇల్లూరి రాము, మెంగ్రే మోహన్, హరికృష్ణ, వైరాగడే సాయి, మర్రి బాలు, జాడి ప్రసాద్, జాడి తిరుపతి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎలగలా సాయి, కమలనాథ్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్, గెడం శ్రీధర్ మరియు స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.ఈ

Search
Categories
Read More
Andhra Pradesh
భారీగా తప్పిన ప్రను ప్రమాదం, గిద్దలూరు టు నంద్యాల ఘాట్ నంద్యాల్ ఘాట్ రోడ్
ఈరోజు అనగా 01/05/2026 మధ్యాహ్నం 12 గంటలకి గిద్దలూరు టు నంద్యాల గ్రానైట్న నీ వేసుకొని వెళ్తున్న...
By Thokala Sivaji 2026-05-01 14:23:55 0 413
Andhra Pradesh
ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా గుడివాడ వెనిగండ్ల రాము
*ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*   *ఇంధన పొదుపు...
By Rajini Kumari 2025-12-15 07:35:34 0 275
Uttarkhand
Security Alert Issued for Uttarakhand and Delhi
Intelligence agencies have issued a high-priority security alert across Uttarakhand and Delhi...
By Lokeshwari Panthadi 2026-06-30 07:49:37 0 113
Jammu & Kashmir
J&K Accelerates Renewable Energy and Hydropower Plans
Jammu & Kashmir is strengthening its energy sector through the expansion of renewable energy...
By Fathima Safa 2026-06-25 13:00:12 0 156
Andhra Pradesh
అంబేద్కర్ జయంతి వేడుకలు: భవనం, విగ్రహ ఏర్పాటుపై పోరాటం కొనసాగింపు
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలంలోని నల్లూరుపల్లి గ్రామంలో ఆదివారం, 12 ఏప్రిల్ 2026న డాక్టర్...
By Kothuru Murali 2026-04-13 08:10:25 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com