ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ కేంద్రం: భయాందోళనలో పిల్లల తల్లిదండ్రులు!

0
281

చింతూరు మండలం రత్నపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణం గత 10 సంవత్సరాలుగా అసంపూర్తిగానే మిగిలిపోయింది. కనీసం ప్రారంభోత్సవానికి కూడా నోచుకోకముందే ఈ భవనం ప్రస్తుతం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. స్లాబ్ పెచ్చులు ఊడిపోతుండటం, వర్షం వస్తే నీరంతా లోపలికి కారుతుండటంతో ఈ కేంద్రం ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.భవనానికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే నిలిపివేశారు. తలుపులు, కిటికీలు సరిగ్గా అమర్చకపోవడం వల్ల అంగన్వాడీ కేంద్రంలో ఉంచే పాలు, గుడ్లు, చిక్కి వంటి చిన్నపిల్లల పోషకాహార పదార్థాలకు కనీస భద్రత లేకుండా పోతోందని అంగన్వాడీ టీచర్ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు ఫోటో లో కనిపిస్తున్నట్లుగా భవనం తలుపులు, కిటికీలు లేకుండా అసంపూర్తిగా ఉంది. పసిపిల్లలు ఉండే ఈ కేంద్రంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయంతో, తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడికి పంపించడానికి తీవ్రంగా భయపడుతున్నారు.చిన్న పిల్లల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ తీవ్రమైన సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు మరియు సంబంధిత శాఖాధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ బిల్లులను క్లియర్ చేసి, భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని లేదా గ్రామస్థులు కోరుతున్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Bharat Aawaz
Truth to Power: The Necessity of a Free Press
Truth to Power: The Necessity of a Free Press నిర్భయమైన, నిష్పక్షపాతమైన పత్రికా స్వేచ్ఛ విలాసం...
By Bharat Aawaz 2025-07-08 17:49:58 0 1K
Andhra Pradesh
AP Capital Amaravati : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. బిల్లును సిద్ధం చేసిన కేంద్రం?
Amaravati Capital : రాజధానిగా అమరావతికి చట్టబద్ధత సిద్ధం చేస్తున్న కేంద్రం. ఈ పార్లమెంటు బడ్జెట్...
By Siva Bhaskar 2026-01-22 04:53:16 0 758
Andhra Pradesh
75 ఏళ్ల నిరీక్షణకు తెర.. శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు, ఏప్రిల్ 13న ప్రారంభం,
జిల్లా ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. జిల్లా చరిత్రలోనే 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం...
By Manda Ramkumar 2026-04-11 02:03:15 0 449
Andhra Pradesh
బాపట్ల జిల్లా బృందం గోవా పర్యటన - కోస్తా టూరిజం అభివృద్ధిపై అధ్యయనం
బాపట్ల: బాపట్ల తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా, గోవాలోని పర్యాటక...
By Gadiyapudi Narendra 2026-02-18 16:20:31 0 247
Andhra Pradesh
ఏపీలో మళ్లీ కరోనా కలకలం... నలుగురి మృతి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా...
By Pagadala Venkateswar 2026-07-17 05:41:40 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com