AP Capital Amaravati : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. బిల్లును సిద్ధం చేసిన కేంద్రం?

0
747

Amaravati Capital : రాజధానిగా అమరావతికి చట్టబద్ధత సిద్ధం చేస్తున్న కేంద్రం. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు వచ్చే అవకాశం. 2024 జూన్ 2తో ముగిసిన ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది.Amaravati Capital: ఈనెల 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ సమావేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 10 ఏళ్లు 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు 2024 జూన్ 2వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్లు కావస్తున్నా ఇంకా దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపై కేంద్రానికి నోట్ అందజేసింది. ఏ తేదీ నుంచి రాజధానిగా ప్రకటించాలో కేంద్ర హోంశాఖ చెప్పాలని అంది. ఈ క్రమంలో 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సంబంధిత కేంద్ర శాఖల నుంచి హోంశాఖ అభిప్రాయాలు కోరడంతో పలు మంత్రిత్వ శాఖలు ఇప్పటికే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. పట్టణాభివృద్ధి, న్యాయ శాఖలు ఇంకా అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఉందంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ముందు కేబినెట్‌లో చర్చించి ఆమోదించనుంది. ఈ మేరకు కేబినెట్ నోట్ తయారీలో హోంశాఖ నిమగ్నమైందని అధికారులు చెప్పారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చౌడేపల్లి: పెన్షన్ల పంపిణీ పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో
చౌడేపల్లి మండలం, చౌడేపల్లి గ్రామ పంచాయతీలో సోమవారం జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని...
By Kothuru Murali 2026-06-01 10:39:36 0 149
International
Global Realignment: Quad Summit & Putin’s Beijing Visit
Significant diplomatic realignments are reshaping global geopolitics. In New Delhi, Quad Foreign...
By Dunna Jessicaruth 2026-05-26 08:25:08 0 597
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు జనసేన, టీడీపీ నాయకుల భాగస్వామ్యం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా రామలయాల్లో విశేష పూజలు జరిగాయి. దోభి...
By Kothuru Murali 2026-03-28 05:59:42 0 223
Andhra Pradesh
వాల్మీకిపురం: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం.
వాల్మీకిపురం ఎస్సై తిప్పేస్వామి తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం కొత్తపల్లి చెరువులో స్నేహితులతో...
By Pagadala Venkateswar 2026-04-30 04:24:56 0 135
Telangana
యువత హుషార్...
తెలంగాణ లో జరుగుతున్న చివరి విడత.. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యూత చాలా హుషారుగా. పాల్గొని తమ ఓటు...
By CM_ Krishna 2025-12-17 04:02:40 0 338
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com