రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

0
169

*రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 

*ఉపాధి కూలీలతో మమేకమైన ఎమ్మెల్యే...కిలోమీటర్ నడిచి పూడిక తీత పనులు పరిశీలన*

 

*వర్షాలకు ముందే ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలి....*

 

*పంట పొలంలో దుక్కు దున్నుతూ.... వ్యవసాయ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే*

 

*శ్రీ జనార్ధన స్వామివారి కమిటీ ప్రమాణ స్వీకారం.... నూతన ధర్మకర్తలను అభినందించిన ఎమ్మెల్యే*

 

*గుడ్లవల్లేరు మే 30:రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా.... కాలువలు అభివృద్ధి చేస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. శ్రీ జనార్ధన స్వామి వారి ఆశీస్సులతో నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలన్నారు.

 

గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామంలోని పోల్ రాజ్ పంట కాలువలో జరుగుతున్న ఉపాధి హామీ పూడిక తీత పనులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం పరిశీలించారు పనులు జరుగుతున్న కాలువ వెంబడి కిలోమీటర్ మేర అధికారులు, కూటమి నాయకులతో కలిసి నడుస్తూ, ఉపాధి హామీ కూలీలను ఆప్యాయంగా పలకరించారు. 

 

కూలీలకు అభివాదాలు చేస్తూ ఫేస్ రికగ్నిషన్ హాజరులో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కొంచెం ఆలస్యం అవుతున్నా అందరికీ హాజరు నమోదు అవుతుందని కూలీలు తెలిపారు. ఎండల్లో జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయాలంటూ కూలీలకు ఎమ్మెల్యే సూచించారు.కాలువ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన, వర్షం కురిస్తే అవాంతరాలు వస్తాయా అని అధికారులను ఆరా తీశారు. 

 

సమీప పొలాల్లో ట్రాక్టర్‌తో దుక్కు దున్నుతూ వ్యవసాయ పనులను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. 

 

 

అనంతరం గ్రామంలోని శ్రీ జనార్ధన స్వామి వారి దేవస్థాన నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ముందుగా దేవాదాయ శాఖ అధికారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాము ప్రత్యేక పూజలు నిర్వహించగా, వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. దేవాదాయ శాఖ అధికారులు నూతన కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించగా, ఎమ్మెల్యే రాము, కూటమి నాయకులు నూతన కమిటీ సభ్యులను అభినందించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ

ఉపాధి హామీ పథకం పేదలకు వరం లాంటిదన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున కూలీలకు మంచినీరు, నీడ, ప్రథమ చికిత్స కిట్లు అందేలా చూడాలన్నారు. ఫేస్ రికగ్నిషన్‌లో సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

కాలువ పనులు నాణ్యతతో చేపట్టాలనీ,వర్షాకాలం ముందే పనులు పూర్తి చేస్తే రైతులకు సాగునీరు అందించగలమన్నారు.

 

శ్రీ జనార్ధన స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల కమిటీ పారదర్శకంగా, భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆలయ అభివృద్ధికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందనీ, దేవుడి ఆశీస్సులతో మన నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి" అని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.

 

దేవస్థాన కమిటీ చైర్మన్ గా బెజవాడ నెహ్రూ బాబు, సభ్యులుగా చింతజల్ల లీలా మురళి కృష్ణ, కానూరి పుష్పలత, మేడూరి కోటేశ్వరరావు, ఎర్రం శెట్టి రమాదేవి, కూనపరెడ్డి శ్రీనివాసరావు, మేడూరి శ్రీదేవి, ఊరి లక్ష్మి, రోమిచర్ల మూర్తి బాధ్యతలు చేపట్టారు

 

ఈ కార్యక్రమాల్లో జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, మండల టిడిపి అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, టిడిపి నాయకులు కొడాలి రామరాజు, వెనిగళ్ళ నాగేశ్వరరావు పామర్తి సత్తిబాబు *గ్రామ నాయకులు* DC ఆంజనేయులు,K. కళ్యాణ్ కృష్ణయ్య,పి. యేసు కుమార్, జనసేన కృష్ణాజిల్లా కార్యదర్శి పేర్ని జగన్,బెజవాడ నెహ్రూ, పేర్ని బాబురావు, సాయన సుధాకర్, కూనపురెడ్డి నాగరాజు, సాయన శ్రీను, దామోదరరావు, M. మహేష్, సూరిశెట్టి హరిబాబు,

అధికారులు, కూటమి నాయకులు, టీడీపీ శ్రేణులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసిన నగర మేయర్ కోవెలమూడి
నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసిన నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర . ఈ సందర్భంగా మేయర్...
By John Baji 2025-12-24 16:06:51 0 260
Telangana
కోర్టుల కంటే హైడ్రా గొప్పదని భావిస్తున్నారా?"  అంటూ హైడ్రాపై నిప్పులు చెరిగిన హైకోర్టు ‎
కోర్టుల కంటే హైడ్రా ఎక్కువ అనుకుంటున్నారా?  ‎ ‎ప్రభుత్వంతో సమాంతరంగా పని...
By Ponnala Srinivasrao 2026-04-14 05:11:36 0 208
Telangana
ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం వాగులో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకే ఒక్క క్షణం అలసత్వం...
By Chunarkar Jagadeesh 2026-08-12 16:56:09 0 190
Andhra Pradesh
మాజీ భార్యపై దాడి కేసు: ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష.
ఆస్తి కోసం మాజీ భార్య నీలిమ, ఆమె భర్త వెంకటేష్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు...
By Pagadala Venkateswar 2026-04-08 05:42:52 0 175
Telangana
"మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.|
హైదరాబాద్ :రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు...
By Sidhu Maroju 2026-06-12 08:16:29 0 380
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com