ఆపరేషన్ క్లీన్ స్వీట్లు రెండవ వారానికి శ్రీకారం

0
146

విజయవాడ నగరపాలక సంస్థ

30-05-2026

 

*ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో రెండో వారానికి శ్రీకారం*

 

 

*కాలువలు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, బ్యాక్ లేన్ల డీ-సిల్టింగ్‌పై ప్రత్యేక దృష్టి*

 

*ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని ముంపు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం*

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా రెండో వారంలో చేపట్టతున్న స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, ప్రధాన కాలువలు, అంతర్గత డ్రెయిన్లు, బ్యాక్ లేన్ల డీ-సిల్టింగ్ కార్యక్రమాలకు శనివారం ఎన్‌టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సమీపంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) డా. డి. చంద్రశేఖర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వలు, ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాలువలు, డ్రెయిన్లలో పేరుకుపోయిన మట్టి, చెత్త, సిల్ట్‌ను పూర్తిస్థాయిలో తొలగిస్తున్నామని తెలిపారు. నగరంలోని అన్ని సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక బృందాలతో డీ-సిల్టింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నాలుగు వారాలపాటు ప్రత్యేక అంశాలతో నిర్వహించబడుతోందని, మొదటి వారంలో రోడ్లు మరియు బహిరంగ ప్రదేశాల పరిశుభ్రతపై దృష్టి సారించగా, రెండో వారంలో స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, కాలువలు, బ్యాక్ లేన్ల శుభ్రత మరియు డీ-సిల్టింగ్ కార్యక్రమాలను ప్రజల సహకారంతో విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు.

 

నగరవ్యాప్తంగా డీ-సిల్టింగ్ పనుల పురోగతిని వివరిస్తూ ఇప్పటివరకు 128.91 కిలోమీటర్ల డ్రెయిన్లలో 116.56 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినట్లు, మిగిలిన 10.97 కిలోమీటర్ల డ్రెయిన్లలో కూడా పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రధాన కాలువల్లో 79.60 కిలోమీటర్లకు గాను 72.23 కిలోమీటర్లు, మధ్య తరహా కాలువల్లో 49.31 కిలోమీటర్లకు గాను 44.33 కిలోమీటర్ల మేర డీ-సిల్టింగ్ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. వర్షపు నీరు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవహించేలా డ్రెయిన్లను పూర్తిస్థాయిలో శుభ్రపరుస్తున్నామని, నగర ప్రజలు కూడా కాలువలు, డ్రెయిన్లలో చెత్త వేయకుండా సహకరించాలని కోరారు. పరిశుభ్రమైన విజయవాడ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

 

 

ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, చీఫ్ సిటీ ప్లాను కే సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ కే చంద్రశేఖర్, సూపర్డెంట్ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల నాయక్ బయాలజిస్ట్ సత్యనారాయణ, ఇంజినీరింగ్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

Search
Categories
Read More
Bihar
Bihar's New Sugar Policy Offers 40 Acres of Land for Re 1
Bihar is sweetening the deal for industrial investors with its groundbreaking Sugarcane...
By Lokeshwari Panthadi 2026-06-26 12:30:19 0 137
Telangana
ప్రధాని సభను విజయవంతం చేయండి, పారేపల్లి మహేష్
రేపు జరగబోయే ఛలో పరేడ్ గ్రౌండ్ విశ్వ గురువు ప్రధాని నరేంద్ర మోడీ సభ తో రాష్ట్రానికి పదివేల కోట్ల...
By Nookapangu Manikanta 2026-05-09 09:26:31 0 151
Telangana
కంటోన్మెంట్ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతినెలా 10 వ తేదీన "కంటోన్మెంట్" వాణి కార్యక్రమం ప్రారంభం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను...
By Sidhu Maroju 2025-08-29 15:00:31 1 547
SURAKSHA
Dr. Pritpal Kaur IPS: Leading with Courage and Compassion
A dentist-turned-IPS officer whose people-centric policing, anti-drug initiatives, and youth...
By Lokeshwari Panthadi 2026-07-23 09:11:43 0 348
Telangana
అల్వాల్ లో వృద్ధుడు అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విన్నపం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన ఒక...
By Sidhu Maroju 2026-03-20 14:15:28 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com