ఎన్టీఆర్ జయంతి .. ఘన నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్.

0
101

ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల ఘన నివాళి

ఆయన ఆధునిక సంఘ సంస్కర్త అని కొనియాడిన సీఎం చంద్రబాబు

మూడు తరాలుగా ఆయనపై గౌరవం తగ్గలేదన్న నారా భువనేశ్వరి

తెలుగుజాతి కీర్తి ఎన్టీఆరేనని స్మరించుకున్న మంత్రి నారా లోకేశ్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబసభ్యులు ఘన నివాళులు అర్పించారు. గురువారం ఈ మేరకు చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' వేదికగా తమ స్మృతులను పంచుకున్నారు.

 

 "కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనే మాటకు ఎన్టీఆర్ నిలువెత్తు నిదర్శనం. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కారణజన్ముడు. సినీ, రాజకీయ రంగాల్లో ధృవతారగా వెలిగిన ఆయన, తెలుగు ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చిన ఆధునిక సంఘ సంస్కర్త" అని ముఖ్యమంత్రి చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.

 

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. "ప్రపంచానికి తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్. అణగారిన వర్గాలకు అండగా నిలిచి, సంక్షేమానికి చిరునామా అయ్యారు. కోట్లాది హృదయాల్లో కొలువైన ఆ మహామనికి జోహార్లు. తాతా.. మీరే మాకు నిత్య నూతన స్ఫూర్తి" అని భావోద్వేగంగా రాసుకొచ్చారు.

 

ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి కూడా తన తండ్రిని స్మరించుకున్నారు. "మూడు తరాలుగా చూస్తున్నాను. ఎన్టీఆర్ అంటే నేటి తరానికి కూడా అదే గౌరవం. చెప్పిన మాటను ఆచరణలో పెట్టి చూపించే ఆయన నిబద్ధతే తెలుగువారికి 'అన్నగారిని' చేసింది" అని ఆమె తన పోస్టులో తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను, ఆశయాలను కుటుంబసభ్యులు స్మరించుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జనగణన నిర్వహణకు సిద్ధం కావాలి: కలెక్టర్
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 16వ జనాభా గణనను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు...
By Boiena Rajesh 2026-03-06 02:16:45 0 221
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు మీ పింఛన్ల కార్యక్రమం
* *టిడిపి - జనసేన -  కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం* :🙏 తేదీ : 28-02-2026, అనగా రేపు దర్శి...
By Chennaiah Kati 2026-02-28 03:44:50 0 354
Andhra Pradesh
ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక.
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం...
By Pagadala Venkateswar 2026-07-31 10:03:04 0 104
Telangana
సుల్తానాబాద్ : నేటి నుంచి అందుబాటులోకి యూరియా బుకింగ్ యాప్...!
రైతులకు పారదర్శకంగా యూరియా అందించేందుకు శనివారం నుంచి యూరియా బుకింగ్ యాప్ అమల్లోకి రానుందని...
By Sunka Santhosh 2026-06-20 13:25:01 0 165
Andhra Pradesh
జాతీయ బీసీ సంక్షేమ సంగం ఆంధ్ర ప్రదేశ్
*బిసిల రక్షణ చట్టాన్ని అమలుచేయబోతున్న*  *ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారికి...
By Rajini Kumari 2026-01-03 09:20:02 0 431
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com