రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం.. పాలనలో దూకుడు చూపిస్తాం: మహానాడులో సీఎం చంద్రబాబు.

0
110

రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం.. పాలనలో దూకుడు చూపిస్తాం: మహానాడులో సీఎం చంద్రబాబు

27-05-2026 Wed 11:49 | Andhra

Chandrababu Naidu Focuses on State Reconstruction at Mahanadu

మహానాడు వేదికగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు

ఎన్నికల నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు నిర్వహణ

టీడీపీ కార్యకర్తల త్యాగాలను, పోరాటాలను గుర్తు చేసుకున్న సీఎం

రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే బీజేపీ, జనసేనతో పొత్తు అని స్పష్టీకరణ

పాలనలో దూకుడుగా, ప్రగతిశీలంగా ముందుకు వెళ‌తామని వెల్లడి

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పాలనలో దూకుడుగా, ప్రగతిశీలంగా ముందుకు వెళుతుంద‌ని ఆయన ఉద్ఘాటించారు. ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించిన మహానాడులో ఆయన వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. "మీటింగ్ మోడల్ మారిందే తప్ప, మహానాడు విధానం మారలేదు. వాహనాల హోరు తగ్గిందేమో కానీ, కార్యకర్తల్లో జోరు తగ్గలేదు" అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

 

కార్యకర్తల త్యాగాలను స్మరించుకున్న చంద్రబాబు 

గత ఐదేళ్లలో పార్టీ ఎదుర్కొన్న కష్టాలను, కార్యకర్తల త్యాగాలను చంద్రబాబు ఉద్వేగంగా గుర్తుచేసుకున్నారు. దాడులు, హింస, అక్రమ కేసులు, వేధింపులు ఎదురైనా టీడీపీ వెనకడుగు వేయలేదని అన్నారు. "నరహంతకులు పీకలు కోస్తున్నా మన కార్యకర్తలు జెండాను వీడలేదు. చంద్రయ్య లాంటి కార్యకర్తను నరుకుతున్నా 'జై చంద్రబాబు, జై తెలుగుదేశం' అంటూ అమరుడయ్యారు. ఆ స్ఫూర్తి కలకాలం నిలుస్తుంది" అని ఆయన నివాళులర్పించారు. తనను అక్రమంగా జైల్లో పెట్టారని, లోకేశ్‌ యువగళం పాదయాత్రను అడ్డుకున్నారని, అయినా ప్రజాస్వామ్యం కోసం టీడీపీ నిలబడిందని వివరించారు.

 

పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవ‌మ‌న్న‌ చంద్రబాబు   

టీడీపీ ఆవిర్భావం, సిద్ధాంతాలను చంద్రబాబు పునరుద్ఘాటించారు. "కూడు, గూడు, నీడ వంటి సంక్షేమ విధానాలతో టీడీపీ ఆవిర్భవించింది. జాతీయ జెండా దేశానికి గౌరవం అయితే, పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం" అని ఆయన అభివర్ణించారు. 45 ఏళ్లుగా ప్రజా సమస్యలపై టీడీపీ నిరంతరం పోరాటం చేస్తోందని, ప్రజల్లో ఆదరణ చెక్కుచెదరలేదని తెలిపారు. బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నామని, ప్రజలు ఆ బాధ్యతను తమకు అప్పగించారని అన్నారు.

 

మ‌హిళ‌ల‌కు ప్ర‌భుత్వం పెద్దపీట

మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు హామీ ఇచ్చారు. గతంలో మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తే, నేడు 'తల్లికి వందనం' వంటి పథకాలతో వారి గౌరవాన్ని పెంచుతున్నామన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు టీడీపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వాహనాల తనిఖీ చేసిన పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వరరావు ఆదేశాలమేరకు బాపట్ల పట్టణ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పట్టణ...
By Gadiyapudi Narendra 2026-02-09 19:29:00 0 239
Andhra Pradesh
Ajit Pawar: అజిత్ పవార్ అంత్యక్రియల్లో నారా లోకేశ్.
బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు నివాళి అర్పించిన నారా లోకేశ్ అంత్యక్రియలకు హాజరైన అనగాని,...
By Pagadala Venkateswar 2026-01-29 09:39:33 0 201
Nagaland
Nagaland Boosts Youth Employment and Skill Programs
Nagaland is intensifying efforts to create employment opportunities and strengthen skill...
By Fathima Safa 2026-06-25 06:50:10 0 128
Andhra Pradesh
ప్రపంచం లోనే ప్రజా స్వామ్య దేశం భారత్
స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ రివి జన్ నియమావళి ప్రకారం 1952 సంవత్సరం నుండి బార తా వని లో21 సంవత్సరం...
By Mobbu Venkatramana 2026-01-31 11:51:23 0 541
Telangana
అంబేద్కర్ గౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదు ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ
• ఈ నెల 17న శాంతియుత ర్యాలీ • ఆసిఫాబాద్ సీఐకి వినతిపత్రం అందజేత 🎤ఆసిఫాబాద్ భారత్...
By Chunarkar Jagadeesh 2026-09-15 13:37:59 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com