ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన డిజిటల్ ఎక్స్‌రే యూనిట్‌ను ప్రారంభించిన : ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి

0
919

పరిగి మే 27 పరిగి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో నూతన డిజిటల్ ఎక్స్‌రే యూనిట్‌ను ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని,డిజిటల్ ఎక్స్‌రే యూనిట్ ద్వారా రోగులకు వేగవంతమైన మరియు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

 

అదేవిధంగా 27 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక వసతి సౌకర్యాలతో నిర్మిస్తున్న 100 పడకల ప్రాంతీయ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు.అత్యవసర చికిత్స, డయాలసిస్‌తో పాటు ఆధునిక వైద్య సేవలను పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈ ఆస్పత్రిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, ఇంచార్జి డీఎంఎచ్హో పవిత్ర, ప్రజాప్రతినిధులు,ఆస్పత్రి సిబ్బంది,స్థానిక నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



#Raghavender, Parigi

Search
Categories
Read More
Telangana
రాజకీయాలకు విరామం - కుటుంబంతో పండగ సంబరం.|
హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్...
By Sidhu Maroju 2026-01-15 14:28:14 0 272
Jammu & Kashmir
🔥 Fierce Encounter in Udhampur: Terrorists Cornered in Basantgarh Forest
A major counter-terrorism operation is currently underway in Basantgarh, Udhampur district...
By Bharat Aawaz 2025-07-09 13:00:09 0 1K
Andhra Pradesh
మహిళలకు ప్రాధాన్యతే లక్ష్యం: బాబి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో...
By Ratna Sekhar 2026-03-08 17:49:11 0 1K
Andhra Pradesh
పుంగనూరు: జాబ్ మేళాకు భారీగా తరలివస్తున్న యువత
బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, పుంగనూరు...
By Kothuru Murali 2026-06-18 10:50:54 0 134
SURAKSHA
Beacon of Integrity: Shri Sonam Tenzing Bhutia's Legacy
From the Himalayan Foothills to International Peacekeeping: How a Veteran Police Leader...
By Kalaga Sailaja 2026-07-31 07:14:50 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com