నిజామాబాద్

0
106

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ వర్ధన్ హాస్పిటల్‌లో డా. సృజిల్ బాబు తేడ్డు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మరియు ఆరోగ్య పరీక్షల కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ శ్రీమతి ఉమారాణి రమేష్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సమాజ సేవకు అంకితభావంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో పలువురు ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచనలు పొందారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు.

Search
Categories
Read More
SURAKSHA
Pink Patrol' for Enhancing Women's Safety
 To ensure women's security, Karnataka Police deployed the 'Pink Patrol' force. These teams...
By Kalaga Sailaja 2026-06-29 11:52:39 0 122
Andhra Pradesh
కడప - బద్వేల్ రోడ్డు మార్గంలో.. కల్వర్టు కూలడంపై స్పందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
కడప-బద్వేల్ రోడ్డు కల్వర్టు కూలిపోవడంపై మంత్రి ఆదేశాలు కడప-బద్వేల్ రోడ్డులో, లంకమల అటవీ...
By Pulse 2025-08-12 10:33:54 0 2K
Andhra Pradesh
ఇంటర్ పరీక్షలు పై పోలీస్ డేగకను: ఎస్పీ
అన్నమయ్య జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్ట...
By Pagadala Venkateswar 2026-02-25 08:50:42 0 190
Jharkhand
Jharkhand Strengthens Water Conservation and Irrigation
Jharkhand continues to enhance water conservation and irrigation through watershed development,...
By Fathima Safa 2026-07-03 15:26:39 0 72
Andhra Pradesh
పడకగదికి సీసీ కెమెరా అమర్చారని ఎస్పీకి ఫిర్యాదు.
మదనపల్లె మండలం పోతబోలు గ్రామానికి చెందిన భాస్కర్ తన పడకగదిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు...
By Pagadala Venkateswar 2026-06-23 06:08:59 1 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com