పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన సామాన్యుడి నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచుతోంది : డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

0
520

🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): ఆసిఫాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆసిఫాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై అదనపు భారం మోపడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, ఇంధన ధరల పెంపుతో రవాణా ఛార్జీలు, సరుకు రవాణా ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తూ సాధారణ ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. వెంటనే పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ తారీక్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు

Search
Categories
Read More
Lakshdweep
Tourism Development and Sustainable Growth in Lakshadweep
Tourism development in Lakshadweep has focused on promoting the islands as a unique eco-tourism...
By Fathima Safa 2026-06-18 09:04:11 0 210
Andhra Pradesh
తిరుమలలో భక్తుల వెల్లువ.. దర్శనానికి 20 గంటల నిరీక్షణ.
  వారాంతం కావడంతో తిరుమలకు పోటెత్తిన భక్తులు నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని...
By Pagadala Venkateswar 2026-09-05 07:06:11 0 155
SURAKSHA
Anurag Jain, IAS:Driving India's Growth Through Visionary Leadership
The Journey Begins "Good governance is built on transparency, innovation, and unwavering public...
By Fathima Safa 2026-07-20 12:11:58 0 211
Andhra Pradesh
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు-రేషన్ బియ్యం పట్టివేత.
శుక్రవారం, మదనపల్లె సీటీఎం రోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ రైస్ మిల్లులపై కడప విజిలెన్స్ ఎస్పీ...
By Pagadala Venkateswar 2026-03-06 07:46:57 0 201
Tamilnadu
"బండి భగీరథ్ కేసులో SIT దర్యాప్తు.. రాజకీయాలు, మీడియా తీరు చుట్టూ కొనసాగుతున్న చర్చ.|
హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి...
By Sidhu Maroju 2026-05-11 10:40:09 0 489
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com