"గోమాత" ను గౌరవిద్దాం - సామరస్యాన్ని కాపాడుదాం....!

0
315

"బక్రీద్ "రోజు ఆవుల కుర్బానీ వద్దు, మేకలు-గొర్రెలతోనే త్యాగం చేద్దాం. ముస్లిం సోదరులకు విజ్ఞప్తి_

: జర్నలిస్టు ఖుద్ధుస్ ఖాన్ 

 

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ :

_ఈ నెల 28న జరుపుకోనున్న పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా నందిగామ డివిజన్ జర్నలిస్టు ఖుద్ధుస్ ఖాన్ ముస్లిం సోదరులకు సోషల్ మీడియా ద్వారా బహిరంగ విజ్ఞప్తి చేశారు._

  ఖుర్బానీ కోసం దయచేసి ఆవులను కొనవద్దు. మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను కొని ఖుర్బానీ ఇవ్వండి. మన హిందూ సోదరులు ఆవులను తల్లిగా, గోమాతగా పూజిస్తారు. వారి మనోభావాలను మనం గౌరవించి మత సామరస్యానికి పాటుపడదాo అని ఆయన కోరారు.

త్యాగానికి అసలైన అర్థం:

బక్రీద్ అంటేనే త్యాగానికి ప్రతీక. ఆ త్యాగం జంతువును వధించడంలోనే కాదు, మన సాటి సోదరుల మనోభావాలను గౌరవించడంలోనూ ఉంది. మనం హిందూ సోదరులను గౌరవించడమే అసలైన త్యాగం అని అన్నారు_

 ఒక మతం వారు పవిత్రంగా భావించే దాన్ని మరో మతం వారు గౌరవిస్తేనే దేశంలో ఐకమత్యం ఉంటుంది. ఇస్లాం కూడా ఇతర మతాలను, వారి ఆచారాలను గౌరవించమనే బోధిస్తుంది. దేశంలో శాంతి, సామరస్యం నెలకొనేందుకు అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని ఆయన పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Telangana
గణేష్ ఉత్సవాలు ఐక్యతకు ప్రత్యేకంగా నిలుస్తాయి : బిఆర్ఎస్ నాయకులు శంబీపూర్ కృష్ణ.
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:   వినాయక చవితి ఉత్సవాల భాగంగా ...
By Sidhu Maroju 2025-09-09 17:12:50 0 375
BMA
Foreign Press Expelled: Regimes Weaponize Visa Denials
Hostile governments are aggressively weaponizing visa denials and sudden expulsions to lock out...
By JoinBMA 2026-08-19 10:52:35 0 89
Andhra Pradesh
ఎయిడ్స్ నియంత్రణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.
ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మదనపల్లి అడిషనల్...
By Pagadala Venkateswar 2026-04-14 06:53:32 0 181
Telangana
ఇంధన నిల్వల పై భయం వద్దు
పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ...
By Dodla Nagaraju 2026-03-25 07:43:06 0 533
Andhra Pradesh
మదనపల్లె బైపాస్‌లో రోడ్డు ప్రమాదం.. 16 మంది భక్తులకు గాయాలు.
మదనపల్లె బైపాస్‌ రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది బోయకొండ భక్తులు...
By Pagadala Venkateswar 2026-05-10 05:46:29 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com