సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల రజతోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం.
Posted 2026-03-02 13:47:56
0
297
వేటపాలెం: వేటపాలెంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ వేడుకలకు రావాల్సిందిగా బాపట్ల జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ ను కళాశాల బృందం సాదరంగా ఆహ్వానించింది.
సోమవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ వినోద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కళాశాల ప్రిన్సిపాల్ డా. జగదీష్ ఫిజికల్ డైరెక్టర్ అన్నం శ్రీనివాసరావు, కలెక్టర్ కు పుష్ప గుత్యం అందించి వేడుకలకు సంబంధించిన అధికారిక ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. జగదీష్ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా కళాశాల సాధించిన ప్రగతిని, నాక్ ఏ గ్రేడ్, ఎన్ బి ఏ గుర్తింపు, అటానమస్ హోదాతో విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన సాంకేతిక విద్య గురించి కలెక్టర్ కు వివరించారు. కళాశాల రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రజల కష్టాలు - సివరేజ్ పనులకు శ్రీకారం చుట్టిన కార్పొరేటర్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు
పుంగనూరు పట్టణంలో శనివారం రాత్రి కొత్త ఇండ్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భాను ప్రకాష్ (26) అనే...
నేడు వడ్డే ఓబన్న జయంతి
నేడు వడ్డే ఓబన్న జయంతి.
తొలి తరం స్వాతంత్ర్య సమరయోధులు తెల్లదోరల అక్రమ పన్నువస్సుల తిరుగుబాటు...
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మార్గాలు నిర్వహిస్తున్న ఉద్యోరులకోసం కలెక్టరెట్లోని ఐడి...
పెన్షన్ కోసం బిడ్డను భుజాన మోసుకుని కలెక్టరేట్‌కు.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తంబళ్లపల్లికి...