కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద "జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి గారి, జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి" డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

0
742

🎤కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు, జూన్ 2వ తేదీన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను అత్యంత విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిలుపునిచ్చారు.శుక్రవారం కెరమెరి మండలం కేస్లాగూడ గ్రామంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,మరియు కార్యకర్తలతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ.. జూన్ 2న కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్డు వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లాకు సంబందించిన పలు కీలక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ సభకు ప్రతి గ్రామ పంచాయతీ నుండి ప్రజలు, రైతులు, మహిళలు మరియు కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా కృషి చేసి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు: తులసిరాం, బాపూరావ్, కెరమెరి ఉప సర్పంచ్ వాగ్మారే శ్రీకాంత్, అమూల్, బలిరాం, కాంగ్రెస్ నాయకులు రాథోడ్ శంకర్ నాయక్, రాథోడ్ సుదర్శన్, కోవ ఇందిరా, రాథోడ్ శంకర్ నాయక్, మందాడే విశ్వనాథ్, నాగేష్, గిడ్డప్ప, మురళి, జగన్నాథ్ రావు, చౌహాన్ శంకర్, కేశవ్, చాహకటి జంగు, భీంరావు, ఆత్రం ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నాణ్యత ప్రమాణాలతో రహదారుల నిర్మాణం
*నాణ్యతా ప్రమాణాలతో ప్రధాన రహదారుల నిర్మాణం*   *-క్వాలిటీ కంట్రోల్ ఏఈ బాషా*  ...
By Rajini Kumari 2026-03-26 13:36:23 0 239
SURAKSHA
Ajit Balaji Joshi, IAS: Shaping Punjab Through Governance
A 2003-batch IAS officer, Ajit Balaji Joshi combines field experience, technology-led...
By Lokeshwari Panthadi 2026-07-25 09:19:37 0 373
BMA
Demolishing Fake News: The Power of Verified Truth
In an era dominated by political IT cells and algorithmic misinformation, the absolute strength...
By JoinBMA 2026-08-21 10:25:05 0 285
Telangana
జగిత్యాలలో బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోతులో పాతర వేస్తా...సీఎం రేవంత్ రెడ్డి
జీవన్ రెడ్డి నీ బుద్ధి సక్కగా లేక జగిత్యాల జనం బండకేసి కొడితే! ఎమ్మెల్యేగా ఓడిపోతే వెంటనే ఎంపీ...
By Ponnala Srinivasrao 2026-04-21 01:13:43 0 168
Maharashtra
Road to the Future: Vidarbha’s ₹51,000 Crore Expressway Boost
The Maharashtra Government has greenlit a massive 550-km access-controlled expressway network...
By Dunna Jessicaruth 2026-05-15 05:48:42 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com