గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం అవసరం : మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్.

0
178

మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ సెంటర్‌ను మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ కలిసి సందర్శించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న యువకులతో డిసిపి మాట్లాడి,వారి ఆరోగ్య పరిస్థితి,చికిత్స విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా డిసిపి గారు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి నార్కోటిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిని గౌరవ కోర్టు ఆదేశాల మేరకు 15 రోజుల పాటు డి-అడిక్షన్ సెంటర్‌కు పంపిస్తున్నామని తెలిపారు.ఇక్కడ వారికి వైద్య చికిత్సతో పాటు మానసికంగా మార్పు తీసుకురావడానికి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు మంచిర్యాల జోన్ పరిధిలో 19 మందికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించి,పాజిటివ్ వచ్చిన వారిని డి-అడిక్షన్ సెంటర్లకు తరలించినట్లు వెల్లడించారు.గంజాయి సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, అలాగే గంజాయి సేవించే వారిని గుర్తించి వారిని ఆ అలవాటు నుంచి దూరం చేస్తే సరఫరా కూడా తగ్గే అవకాశముందని డిసిపి అన్నారు. తల్లిదండ్రులు,పెద్దలు తమ పరిసరాల్లో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నా లేదా సేవిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.పోలీసులు స్పందించి నిందితులపై కేసులు నమోదు చేసి నార్కోటిక్ పరీక్షలు నిర్వహిస్తారని, పాజిటివ్ వచ్చిన వారిని డి-అడిక్షన్ సెంటర్లకు పంపించి చికిత్స అందిస్తామని తెలిపారు.అయితే చికిత్స తర్వాత కూడా మళ్లీ మత్తు పదార్థాలకు బానిసై పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.నిపుణులైన వైద్యుల సహాయంతో మత్తు బారిన పడిన వ్యక్తులు తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చే అవకాశం ఉందని, డ్రగ్స్ రహిత మంచిర్యాల నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని డిసిపి భాస్కర్ పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Telangana
షవర్ బాత్ చేసిన గణేష్ మహరాజ్.
హైదరాబాద్ జిల్లా. సికింద్రాబాద్ :  గణేష్ మహారాజ్ షవర్ బాత్ చేయడమేంటి అని ఆశ్చర్య పోతున్నారా?...
By Sidhu Maroju 2025-09-03 18:48:28 0 460
Tamilnadu
Tamilnadu tvk party
మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు మా ప్రభుత్వం వచ్చాక మహిళలకు నెలకు రూ.2500...
By G k Nookala 2026-03-07 18:00:11 0 337
Andhra Pradesh
సర్ ప్రక్రియను పూర్తి చేయాలి: కలెక్టర్
విజయనగరం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం రాజాం తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు....
By Boiena Rajesh 2026-08-12 13:56:04 0 96
Andhra Pradesh
A. p capitl development and economy
రాజధాని, అభివృద్ధి & ఆర్థికంఅమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా చట్టబద్ధత కల్పించే...
By G k Nookala 2026-02-09 17:45:22 0 312
BMA
Big Tech Monopoly: Denying Revenue to Indian Publishers
The Indian news industry mistakenly relied on government intervention to force Big Tech...
By JoinBMA 2026-08-20 07:59:20 0 71
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com