డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ సైబర్ మోసం*

0
375

విశాఖకు చెందిన ముగ్గురు సైబర్ నేరస్థుల అరెస్ట్.. రూ.10 లక్షల నగదు స్వాధీనం

బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ పరిధిలోని చీరాల II టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన భారీ సైబర్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. “డిజిటల్ అరెస్ట్” పేరుతో భయపెట్టి రూ.26.50 లక్షలు కాజేసిన కేసులో విశాఖపట్నానికి చెందిన ముగ్గురు సైబర్ నేరస్థులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

కేసుకు సంబంధించిన వివరాలను చీరాల సబ్ డివిజన్ అధికారి ఎం.డి. మొయిన్ మీడియాకు వెల్లడించారు. కొత్తపేట గ్రామానికి చెందిన కె. మోహన్ రావును సోషల్ మీడియా ద్వారా సంప్రదించిన నిందితులు, తమను పోలీసులమని పరిచయం చేసుకుని అతనిపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని బెదిరించారు. కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు చెల్లించాలని నమ్మబలికి విడతల వారీగా రూ.26.50 లక్షలు మోసపూరితంగా వసూలు చేశారు.

బాధితుడు మార్చి 30, 2026న చీరాల II టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు Cr.No.43/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 318(4) మరియు ఐటీ యాక్ట్ 66(D) కింద కేసు నమోదు చేశారు.

ఇటీవల వరుసగా జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ తరహా సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కేసును పోలీసులు సవాలుగా స్వీకరించారు. చీరాల సబ్ డివిజన్ అధికారి ఎం.డి. మొయిన్ పర్యవేక్షణలో, బాపట్ల ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలోని టెక్నికల్ బృందం అందించిన సమాచారంతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు.

చీరాల II టౌన్ సీఐ ఏ. శశికుమార్ నాయకత్వంలో ప్రత్యేక పోలీస్ బృందాన్ని విశాఖపట్నానికి పంపించారు. అక్కడ నిందితుడు నాగ ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి రూ.8 లక్షలు, మరో నిందితుడు నీల్ కుమార్ వద్ద నుంచి రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బొందలపు గోవిందు ఖాతాకు రూ.14 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు. మొత్తం మూడు ఖాతాలకు రూ.26.50 లక్షలు బదిలీ అయినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ కేసులో ఇప్పటివరకు రూ.10 లక్షలు రికవరీ చేశామని, మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. మిగతా నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు.

ప్రజలను ఉద్దేశించి పోలీసులు మాట్లాడుతూ “డిజిటల్ అరెస్ట్” అనే ప్రక్రియ అసలు లేదని, అపరిచితుల బెదిరింపులకు భయపడి డబ్బులు పంపవద్దని హెచ్చరించారు. సైబర్ నేరస్థులు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ఇలాంటి మోసాలపై పోలీస్ శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచించారు.

కేసు చేదనలో విశేష కృషి చేసిన పోలీస్ సిబ్బందిలో ఇన్స్పెక్టర్ ఏ. శశికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ కె. మురళి, హెడ్ కానిస్టేబుల్ జి. మల్లేష్, పోలీస్ కానిస్టేబుళ్లు ఎస్‌కే నాగూర్, ఎం. శ్రీనివాస్, టీ. బాలాజీ, సీహెచ్ రాజేష్, ఎస్. ఆంజనేయులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
మంచిర్యాల: జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి మంచిర్యాల కలెక్టరేట్ లో అధికారులు,...
By Pinnehasan Odela 2026-03-11 17:03:58 0 224
Telangana
గురవయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
 స్వేరోస్ సంస్థ క్రియాశీలక కార్యకర్త, ఆటో డ్రైవర్ కందుకూరి గురవయ్య స్వేరో ఇటీవల అనారోగ్యంతో...
By Nookapangu Manikanta 2026-05-08 09:30:49 0 257
Andhra Pradesh
మదనపల్లెలో గ్యాస్ సిలిండర్ మంటలు.. ఇద్దరికి గాయాలు.
మదనపల్లె పట్టణంలోని రామనగర్‌లో శనివారం ఉదయం గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి,...
By Pagadala Venkateswar 2026-06-20 13:22:43 0 100
Andhra Pradesh
రూ.1.6 కోట్లతో రోడ్ల నిర్మాణం
రోడ్లు నిర్మాణం పూర్తయితే గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, వర్షాకాలంలో మురుగు నీటి...
By Manda Ramkumar 2026-03-27 01:01:33 0 231
Andhra Pradesh
పుంగనూరు: సుగాలి మిట్ట వద్ద ఢీకొన్న లారీలు
పుంగనూరు మండలం సుగాలి మిట్ట వద్ద శుక్రవారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కంటైనర్ తో...
By Kothuru Murali 2026-06-06 14:19:06 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com