"అల్వాల్‌లో యువతి మిస్సింగ్.. ప్రియుడిపైనే తల్లి అనుమానం.?

0
282

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం స్రవంతి నగర్‌లో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

స్రవంతి నగర్ ప్లాట్ నెంబర్ 419లో నివాసం ఉంటున్న కొత్తపల్లి మంజుల కుమార్తె సునీత (20) ఈ నెల 19వ తేదీ ఉదయం నుండి అకస్మాత్తుగా అదృశ్యమైంది. 

ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో తల్లి మంజుల స్నానానికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న సునీత కనిపించకుండా పోయింది. యువతితో పాటు ఆమె బట్టలు, మొబైల్ ఫోన్ కూడా మాయమవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

బాధిత కుటుంబ సభ్యులు తమకు తెలిసిన ప్రాంతాలతో పాటు సొంత ఊరిలోనూ సునీత కోసం గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. 

అయితే, గతంలో సునీత తాను ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ యువతి తల్లి గురువారం సాయంత్రం అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, యువతిని సురక్షితంగా కనిపెట్టేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
స్పెషల్ ఆఫీసర్స్ విద్యార్థులతో భోజనం చేయాలి
వసతి గృహాల నిర్వహణపై నివేదికలు వెంటనే ఇవ్వాలి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్. మహబూబాబాద్ :...
By Bheeshman King 2026-09-19 15:06:28 0 69
Telangana
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పలువురి రౌడీషీటర్ల బైండోవర్.|
హైదరాబాద్: జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు షాక్....
By Sidhu Maroju 2025-10-27 15:38:21 0 311
Maharashtra
Maharashtra Strengthens Disaster Management Preparedness
Maharashtra continues to strengthen its disaster management framework through advanced early...
By Fathima Safa 2026-07-02 09:42:16 0 166
Andhra Pradesh
KL యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ పరీక్ష ఫలితాలు విడుదల
*కె ఎల్ యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.* ఆడపిల్లకు చదువే అసలైన...
By Rajini Kumari 2026-01-10 12:42:30 0 224
Andhra Pradesh
Chintakayala Vijay: ఆ నమ్మకంతోనే ఏపీకి పెట్టుబడుల వెల్లువ: చింతకాయల విజయ్.
Chintakayala Vijay: ఆ నమ్మకంతోనే ఏపీకి పెట్టుబడుల వెల్లువ: చింతకాయల విజయ్. | Andhra  ...
By Pagadala Venkateswar 2026-02-06 05:03:12 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com