శ్రీ రాజరాజేశ్వరి లలితా సత్సంగ్ నూతన క్యాలెండర్- ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
236

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  శ్రీ రాజరాజేశ్వరీ లలితా సత్సంగ్ కమిటీ ఆధ్వర్యంలో తయారు చేయించిన నూతన సంవత్సర క్యాలెండర్ ( కాలమానిని) ఆవిష్కరణ కార్యక్రమం సికింద్రాబాద్ కుమ్మరి గూడ లోని శ్రీ రాజరాజేశ్వరీ దేవాలయంలో సత్సంగ్ కమిటీ సభ్యులు బుధవారం నిర్వహించారు.

క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరై క్యాలెండర్ (కాలమానిని) ను ఆవిష్కరణ చేసి లలితా సత్సంగ్ కమిటీ సభ్యులకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు .

క్యాలెండర్ ఆవిష్కరణకు దేవాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు దేవాలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద పండితులచే ఘనంగా ఆశీర్వచనం ఇప్పించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ కు స్వాగతం పలికిన వారిలో ఇ.ఓ రవికాంత్, సత్సంగ్ కమిటీ సభ్యులు విజయ లక్ష్మి, రుక్మిణి, అరుణ, టెంపుల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వీరలక్ష్మి, కుమారి, ప్రభావతి ఉన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ యాదవ్, శేఖర్ ముదిరాజ్,టెంపుల్ కమిటీ చైర్మన్ లు ప్రభాకర్ యాదవ్, వెంకట్రాజు, తదితరులు ఉన్నారు.

#sidhumaroju

Like
1
Search
Categories
Read More
Rajasthan
Pharma License Revoked After Tragic Deaths in Kota
The Rajasthan government has officially revoked the license of a pharmaceutical firm in Kota...
By Lokeshwari Panthadi 2026-07-01 08:43:34 0 106
Arunachal Pradesh
Army Truck Plunges Into Dirang Gorge; One Soldier Dead
A tragic accident occurred in the West Kameng district when an Indian Army truck veered off...
By Lokeshwari Panthadi 2026-06-27 04:12:37 0 148
Telangana
రుసేగావ్ గణతంత్ర దినోత్సవం సంబరాలు
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం: మద్నూర్ మండలం :రుసేగావ్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవ...
By Thativar Shivaji 2026-01-26 15:27:51 0 742
SURAKSHA
AP Retired Cops: Blood Donors Saving Lives Daily
Yesterday retire అయిన AP police officers blood donation కి ముందు వరుసలో నిలబడ్డారు. "Raktam...
By Kalaga Sailaja 2026-07-03 13:52:42 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com