ఏపీలో భవన నిర్మాణ కార్మికులకు గుడ్‌న్యూస్.. పథకాలు పునరుద్ధరణ.

0
109

కార్మికులు, యాజమాన్యం రెండు కళ్లలా చూస్తామన్న మంత్రి సుభాష్

భవన నిర్మాణ కార్మికులకు నిలిచిన సంక్షేమ పథకాల పునరుద్ధరణ

వివాహ కానుక, ప్రసూతి సహాయం వంటి పథకాలు తిరిగి ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా లేబర్ అడ్డాలు, కొత్త ఈఎస్ఐ ఆసుపత్రుల ఏర్పాటు

పరిశ్రమల్లో జీరో యాక్సిడెంట్స్ లక్ష్యంగా ప్రత్యేక భద్రతా చర్యలు

రాష్ట్రాభివృద్ధిలో కార్మికులు, యాజమాన్యాన్ని రెండు కళ్లలా భావిస్తూ ప్రభుత్వం సమతుల్యంగా ముందుకు సాగుతోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన 'శ్రమ శక్తి, ఉత్తమ యాజమాన్య పురస్కారాలు-2026' ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కార్మికుల సంక్షేమం, భద్రత, ఉపాధి, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వివాహ కానుకగా రూ.20,000, ప్రసూతి సహాయంగా రూ.20,000, సహజ మరణానికి రూ.60,000, అంత్యక్రియలకు రూ.20,000 అందిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

 

పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తూ, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 20 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్మికుల కోసం రాష్ట్రవ్యాప్తంగా "లేబర్ అడ్డాస్" ఏర్పాటు చేసి ఉపాధి, విశ్రాంతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. రూ.250 కోట్లతో హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు, తిరుపతి, విశాఖ సహా ఐదు నగరాల్లో ఆధునిక ఈఎస్ఐ ఆసుపత్రులు, 30 కొత్త డిస్పెన్సరీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరిశ్రమల్లో "జీరో యాక్సిడెంట్స్" లక్ష్యంగా థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్లు నిర్వహిస్తామని మంత్రి సుభాష్ వివరించారు.

 

అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులకు, ఆదర్శవంతమైన యాజమాన్యాలకు మంత్రి, ఇతర ఉన్నతాధికారులు పురస్కారాలు ప్రదానం చేశారు.

Search
Categories
Read More
BMA
Delhi HC Protects Press Archives Over Digital Erasure
The Delhi High Court recently balanced the "Right to Be Forgotten" with open justice, ensuring...
By JoinBMA 2026-08-20 05:09:25 0 120
Andhra Pradesh
Ajit Pawar: అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం.
Ajit Pawar: అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం 28-01-2026 Wed 13:13 | Andhra Ajit Pawar...
By Pagadala Venkateswar 2026-01-28 10:29:38 0 176
Andhra Pradesh
*దూళ్ళ వారి నూతన వస్త్ర బహుకరణ మహోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల పట్టణం పాత బస్టాండ్ ఏరియా లో గల పూర్ణ ప్యాలెస్ నందు జరుగుతున్న బాపట్ల అసోసియేషన్ సీనియర్...
By Vadlamudi NagaVenkat 2026-03-05 08:55:51 0 397
Telangana
కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి.. సీఎం రేవంత్ రెడ్డి మరో ఎత్తుగడ
ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ సభ ఉన్న రోజే.. రేవంత్ రెడ్డి కాళేశ్వరం బరాజ్ ల సందర్శన కాళేశ్వరంలో...
By Ponnala Srinivasrao 2026-04-19 02:13:00 0 156
Telangana
సింగరేణి బాయి బాటలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత
మంచిర్యాల జిల్లా : టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్ వద్ద కవిత...
By Avunoori Mahesh 2026-06-15 07:21:55 0 255
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com