రోడ్డు పక్కన తాటి ముంజలను ఆస్వాదించిన చంద్రబాబు, భువనేశ్వరి.

0
107

నేడు కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, భువనేశ్వరి

తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద ఆగిన చంద్రబాబు దంపతుల వాహనం

సాక్షాత్తు సీఎం తన వద్దకు రావడంతో ఆనందంలో మునిగిపోయిన తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తులు

కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన తాటి ముంజలు అంటూ సీఎం ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి గ్రామీణ జీవనశైలికి, సామాన్య ప్రజలకు తాము ఎంత దగ్గరో నిరూపించే ఒక అరుదైన, ఆహ్లాదకరమైన క్షణాన్ని పంచుకున్నారు. ఈరోజు కుప్పం పర్యటనకు వెళ్తున్న క్రమంలో, రహదారి పక్కన తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద సీఎం దంపతుల వాహనం ఆగింది. వారు స్వయంగా కారు దిగి, వారి వద్ద తాటి ముంజలను కొనుగోలు చేయడమే కాకుండా, అక్కడే నిలబడి ఎంతో ఆప్యాయంగా తింటూ ముచ్చటించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన వద్దకు వచ్చి సాదాసీదాగా మాట్లాడటంతో ఆ కార్మికుడు ఆనందంలో మునిగిపోయాడు.

 

 

ఈ అరుదైన క్షణాన్ని చంద్రబాబు ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కల్తీ లేదు... కార్బైడ్ లేదు.. పురుగు మందుల గోల లేదు.. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటి ముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది" అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ సందర్భంగా తాటి ముంజలు అమ్మే వ్యక్తి కుటుంబ పరిస్థితులు, వ్యాపారం, యోగక్షేమాల గురించి సీఎం దంపతులు అడిగి తెలుసుకున్నారు. సీఎం దంపతులు చూపిన ఈ నిరాడంబరత, అప్యాయతలపై స్థానికులు ప్రశంసలు కురిపించగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు
పుంగనూరు నియోజకవర్గం, సదుం జడ్పి ఉన్నత పాఠశాలలో 1985-86 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు...
By Kothuru Murali 2026-04-26 10:54:12 0 139
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో పెరిగినచలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి...
By Kothuru Murali 2026-01-11 13:22:56 0 223
Andhra Pradesh
మదనపల్లి సమస్యలపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసెంబ్లీలో గళమెత్తాలి.. పునీత్ కుమార్
మదనపల్లి నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గట్టిగా...
By Pagadala Venkateswar 2026-02-14 06:41:12 0 218
Telangana
నిజామాబాద్: ప్రజాపాలన ప్రగతిప్రణాలిక
నగరంలోని శ్రీరామ గార్డెన్ లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశంలో...
By Sadaq Sadaq 2026-05-02 14:52:44 0 171
Andhra Pradesh
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా సృజనా చౌదరి ఆలయ సిబ్బందికి అభినందనలు
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భముగా విజయవాడ వన్ టౌన్ ఎమ్మెల్యే శ్రీ సుజన చౌదరి గారు శ్రీ...
By Rajini Kumari 2025-12-16 11:15:56 0 292
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com