రేపు చంద్రబాబు కావలి పర్యటన షెడ్యూల్ ఇదిగో!

0
119

Andhra

Chandrababu Naidu Kavali visit schedule

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

'మత్స్యకార సేవలో' కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

తుమ్మలపెంట గ్రామంలో బహిరంగ సభ, నిధుల విడుదల

మత్స్యకార కుటుంబాలతో భేటీ, టీడీపీ శ్రేణులతో సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. వేట నిషేధ కాలంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా మత్స్యకారులను ఆదుకునేందుకు అమలు చేస్తోన్న ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద వరుసగా రెండో ఏడాది ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేయనుంది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు.

 

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొని, మత్స్యకార కుటుంబాలతో ముఖాముఖి భేటీ కానున్నారు.

 

అధికారిక షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి ఉదయం 9:30 గంటలకు అమరావతిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు. ఉదయం 10:30 గంటలకు కావలి మండలం తుమ్మలపెంట గ్రామానికి చేరుకుంటారు. ఉదయం 10:45 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయనున్నారు. 

 

మధ్యాహ్నం 1:15 గంటలకు తుమ్మలపెంట గ్రామంలోని మత్స్యకార కుటుంబాలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమవుతారు. వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ శ్రేణులతో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని సాయంత్రం 4:45 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.

Search
Categories
Read More
Andhra Pradesh
భవాని దీక్షలు విరమణ కార్యక్రమం మొదటి రోజు
నిజం: భవానీ దీక్ష విరమణ మొదటి రోజు కార్యక్రమాలు              ...
By Rajini Kumari 2025-12-12 17:06:49 0 302
Telangana
Drugs: The Road to Crime.|
● Parents urged to watch behavioural changes in children and youngsters ● Drug-related...
By Sidhu Maroju 2026-09-16 04:28:02 0 111
Andhra Pradesh
మదనపల్లిలో 15000 మంది తిలకించేలా రిపబ్లిక్ డే.
మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి...
By Pagadala Venkateswar 2026-01-25 12:28:14 0 199
SURAKSHA
Superintendent of Police for various regions, including Vizianagaram.
Madireddy Pratap IPS: A Visionary Officer Who Redefined Public Safety and Professional Policing...
By Kalaga Sailaja 2026-07-13 07:49:59 0 137
SURAKSHA
S. Suhas, IAS: A Visionary Leader Driving Inclusive Governance
The Journey Begins "Good governance is about making every citizen feel...
By Fathima Safa 2026-07-15 11:48:25 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com