బడిబాట కార్యక్రమం తో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు వెలువ

0
255

*బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు వెల్లువ*

 

*బీఆర్ నగర్ మున్సిపల్ హైస్కూల్‌లో తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన*

 

*నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా రంగానికి నూతన దిశ*

 

*మౌలిక వసతుల మెరుగుదలతో పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి*

 

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం మంగళగిరి పట్టణంలోని కొత్తపేట ఒకటో వార్డులోని బీఆర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో గురువారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా కొత్తగా చేరే విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించగా, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎంఈఓ-1 ఉషా కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ‘తల్లికి వందనం, మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ వంటి సంక్షేమ పథకాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎంఈఓ-2 బాబు మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో పూర్తిస్థాయి బోధన కొనసాగుతోందన్నారు. మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్య అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకుంటే విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సంగినేని శ్రీనివాసరావు, మోడల్ ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జి. ఉషా లక్ష్మి, ఉపాధ్యాయులు, సీఆర్పీలు నాగమణి, ధనలక్ష్మి, అజయ్, మధు, మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తలకు 10 లక్షలు ప్రమాద బీమా పంపిణీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రామాపురం మండలం లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-14 10:47:41 0 341
Andhra Pradesh
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు 06-02-2026 Fri...
By Pagadala Venkateswar 2026-02-06 13:24:19 0 370
Andhra Pradesh
తప్పుడు కధనాలు ప్రచురించిన పత్రికలపై చర్యలు తీసుకోవాలి:గిరిజనులు
బొబ్బిలి మండలం డొంగురువలస గిరజనగ్రామంలో రామాలయం ఎదుటనున్న పాకను తొలగించి,మా గిరిజనులపై తప్పుడు...
By Boiena Rajesh 2026-06-09 16:48:11 0 435
Andhra Pradesh
మదనపల్లి: ఆస్తి తగాదాతో అన్నదమ్ములమధ్య ఘర్షణ–ఆసుపత్రిలో చేరిక.
మదనపల్లిలో ఆదివారం ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ములైన సుహేల్ (26), రియాజ్ (24) మధ్య తలెత్తిన...
By Pagadala Venkateswar 2026-02-08 10:53:00 0 207
Andhra Pradesh
*దోర్నాల మండలంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఉన్నత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు
*దోర్నాల మండలంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఉన్నత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన గూడూరి...
By Chennaiah Kati 2026-06-24 14:07:52 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com